ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు, అరుదైన అవకాశం- షెడ్యూల్.. సేవలు..!!

శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం దక్కనుంది. తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసారు. ముందస్తుగానే భక్తులకు సూచనలు చేస్తున్నారు. నిత్యం నిర్వహించే వాహన సేవల వివరాలను వెల్లడించారు.

Advertisement

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధికమాసం కారణంగా ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన టీటీడీ ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అదే విధంగా అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్స వాలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ అంకురా ర్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. 16వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం నిర్వహించనున్నారు.

Advertisement
గోదావరి మహోగ్రరూపం, పోటెత్తుతున్న కృష్ణమ్మ- ముంపు.. తాజా హెచ్చరికలు..!!

బ్రహ్మోత్సవాల షెడ్యూల్

అదే విధంగా సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ ఉండనుంది. 18న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ ఉంటుందని అధికారులు వెల్లడించారు. 19న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం, 20న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ ఉంటుంది. 21వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం నిర్వహించనున్నారు. 22న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటుంది. 23న ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

English Summary

TTD will host the rare twin Srivari Brahmotsavams this year due to the occurrence of Adhika Masam