రైతులకు కేంద్రం బిగ్ రీలీఫ్ - కీలక నిర్ణయం...!!

రైతులకు కీలక అప్డేట్. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల పంటకు బీమా సౌకర్యం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు రైతులకు ఇచ్చిన గడువును కేంద్రం తాజాగా పొడిగించింది. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం రాష్ట్రంలోని రైతులందరికీ వర్తిస్తుందని ప్రకటించారు.

Advertisement

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. వీటి ప్రీమియం చెల్లింపు గడువును పెంచాలని కోరగా.. బీమా సంస్థలు ఫసల్ బీమా యోజన గడువును మాత్రమే పెంచాయి. కేంద్రం వ్యవసాయశాఖ మంత్రి బీమా సంస్థలతో చర్చలు జరిపారు. అనంతరం బీమా సంస్థలు ప్రీమియం చెల్లించేందుకు మరింత గడువు ఇచ్చాయి. దీంతో రైతులు త్వరగా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ కోరుతోంది. ప్రధానమంత్రి ఫసల్ బీయా యోజన పథకంలో చేరేందుకు జులై 31 వరకు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో చివరిరోజు గ్రామ, వార్డు సచివాయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, డిజిటల్ సేవా కేంద్రాలకు రైతులు క్యూ కట్టారు.. అక్కడ సర్వర్లు మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో, అనేక మంది అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

Advertisement
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రూ 4,597 కోట్లు విడుదల..!!

ఏపీ ప్రభుత్వం వినతితో గడువు పొడిగింపు

కాగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, కేంద్ర వ్యవసాయ శాఖ బీమా కంపెనీలతో చర్చలు జరిపి మరికొంత సమయాన్ని కేటాయించింది. తాజా నిర్ణయంతో పీఎం ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపుల గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయించారు. ఇప్పుడు ఈ పథకానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారితో పాటు రుణాలు తీసుకోని రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రీమియం భారాన్ని భరిస్తున్నాయి. గడువు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అర్హులైన రైతులకు రిలీఫ్ దక్కనుంది. వర్షాలు, వరదలు, కరువు వంటి ఊహించని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న సమయంలో ఈ బీమా విధానం ద్వారా పరిహారం అందుతుంది.

English Summary

Union Govt extends pm fasala bhima yoajana time registration time up to Agugust 15 as latest circular