ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు? పండితుల స్పష్టత, ఇదీ పూజా ముహూర్తం..!!

వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం కు ప్రత్యేకమైన విశిష్ఠత ఉంది. మహిళలకు భక్తి శ్రద్దలతో ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. కాగా.. ఈ సారి వరలక్ష్మీ వ్రతం ముహూర్తం పైన సందిగ్ధత నెలకొని ఉంది. ఈ నెల 21 లేదా 28 వ తేదీల్లో ఎప్పుడు వ్రతం ఆచరించాలనేది స్పష్టత లేదు. వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఏ రోజున వచ్చింది.. వ్రతం ఎప్పుడు చూసుకోవాలనే దాని పైన ప్రముఖ పంచాంగకర్తలు, సిద్ధాంతులు స్పష్టతనిచ్చారు.

Advertisement
వరలక్ష్మీ వ్రతం ఎలా జరుపుకోవాలి? శాస్త్రం ఏం చెబుతోంది?
Advertisement

శ్రావణ మాసం రాకతో పండుగల సందడి మొదలైంది. మహిళలు అత్యంత నిష్టతో, భక్తిశ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఏ రోజున వచ్చింది? ఆగస్టు 21నా లేదా ఆగస్టు 28నా? అనే అంశంపై భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది. తెలుగు పంచాంగం ప్రకారం సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించా లని స్కంద పురాణంలో వివరించి ఉంది. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం వల్ల వరలక్ష్మీ వ్రతం విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. పంచాంగ గణన ప్రకారం శ్రావణ పౌర్ణమికి (రాఖీ పండుగకు) ముందు వచ్చే శుక్రవారమే ప్రధాన వరలక్ష్మీ వ్రతంగా ఆచరించడం సనాతన ధర్మ సాంప్రదాయం.

Advertisement
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎందుకు జరుపుకుంటారు? ఉపయోగాలేంటి?

కాగా.. ఆగస్టు 28, పౌర్ణమి తిథి, శ్రావణ మాసం మూడో శుక్రవారం రెండూ కలిసి రావడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది. పౌర్ణమికి ముందు శుక్రవారం అయినా పౌర్ణమితో కూడిన శుక్రవారం అయిన ఒకటే అని శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 28 నే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఆగస్టు 28 న పూర్ణిమ తిథి సాయంత్రానికి లేనందున ఈ సంప్రదాయాన్ని అనుసరించి సాయంకాలం వ్రతం ఆచరించే వారు ఆగస్టు 21, రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు మాత్రం ఆగస్టు 28, మూడో శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

English Summary

Varalakshmi Vratam 2026:With differing opinions among devotees, Vedic scholars and astrologers have now provided clarity.