నేను ఏ పార్టీలో ఉంటానో తెలీదు: విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు


హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని తేల్చి చెప్పారు.

పరిశ్రమలు ఎక్కడ బాబూ! ప్రజా రాజధానా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా?: ఉండవల్లి ఫైర్

అంతేగాక, 'ఈ రోజు బీజేపీలో ఉన్నాను. రేపు ఉంటానో లేదో తెలియదు.. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన నిధుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా.. టీడీపీ నేతలు కల్పించుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు.

ఈ క్రమంలో స్పందించిన విష్ణుకుమార్ రాజు ఈ విధంగా వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలే మాట్లాడతానని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తన నైజమన్నారు.

గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని ఆరోపిస్తున్నారని, నిజానికి దానికి ఇచ్చింది రూ.300 కోట్లేనని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్న ఆయన.. అందుకోసం తాను కూడా పోరాడతానని వ్యాఖ్యానించారు.

Have a great day!
Read more...

English Summary

BJP MLA Vishnu Kumar Raju on party changing issue.