బీజేపీవి మాటలే...చేతల్లేవ్:చంద్రబాబు;అధ్యక్షా!ఇందులో అవినీతి జరిగిందేమోనని అనుమానంగా ఉంది:ఎమ్మెల్యే


అమరావతి:బీజేపీ ప్రభుత్వం మాటలే చెబుతోంది తప్ప...చేతల్లో చూపించలేకపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను బిజెపి నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు.

జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్...పితాని బాలకృష్ణముమ్మడివరం నియోజకవర్గం

మంగళవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఏ ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ కార్యక్రమాల అమలులో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

బిజెపి...అన్నీ కుట్రలే

అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని మోడీ చూశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాజకీయంగా టిడిపిసి ఒంటరిని చేయాలని చూస్తున్నారని...రాష్ట్రంలో పార్టీని బలహీనపరచాలని కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ధ్వజమెత్తారు.

యువనేస్తం టీమ్ పై...సిఎం ప్రశంసలు

అనంతరం యువనేస్తం పథకం గురించి మాట్లాడుతూ ఈ పథకం కోసం పనిచేసిన మంత్రుల సబ్ కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. యువనేస్తం కార్యక్రమం దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు. ఈ ఏడాది 1.60 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తయిందన్నారు.

అంత ఖర్చు...ఎందుకు అవుతోంది?

మరోవైపు మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ పధకాల అమలులో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. " అధ్యక్షా.. రాష్ట్రంలో అర్బన్ హెల్త్ సెంటర్స్, రాష్ట్రీయ బాల సురక్ష యోజన స్కీంకు కేవలం మన ఏపీలోనే ఒక్కో సెంటర్‌కు నాలుగు లక్షలకు పైగా ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. మిగతా రాష్ట్రాల్లో లక్షా డెబ్బై వేల నుంచి రెండు లక్షల లోపు మాత్రమే ఖర్చవుతోంది. అసలు మన రాష్ట్రంలో ఇంత ఖర్చు ఎందుకు అవుతోంది..? ఖర్చులు ఎందుకు పెరిగాయి..? ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్లా ఇలా జరుగుతోందా..? లేకుంటే ఇంకేమైనా వేరే కారాణాలున్నాయా..?...అని ఆకుల సత్యనారాయణ ప్రశ్నించారు.

ఆ శాఖలోనే ఎందుకిలా?...కారణం అదేనా?

"రాష్ట్రానికి ప్రస్తుతం హైల్త్ మినిస్టర్ లేరు? ఆ శాఖ సిఎం దగ్గరే ఉంది. వారికున్న బిజీ షెడ్యూల్‌లో హెల్త్ శాఖ అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. స్క్రీనింగ్ కోసం ఓ వైపు, అర్బన్ ఏరియాల్లో ఉన్న పేదవారికోసం మెడిసిన్స్, డయాగ్నోసిస్‌, చిన్న పాటి జ్వరాలకు విపరీతమైన ఖర్చు అవుతోంది. అసలు ఎందుకిలా అవుతోంది?.. ఇందులో అవినీతి జరిగిందేమో..? అని నాకు అనుమానంగా ఉంది...తప్పకుండా ఈ పాలసీనీ రివ్యూ చేసి సరిగ్గా చూసుకోవాలి...ప్రైవేట్ వ్యక్తులకు అంత ఎక్కువ మొత్తంలో ధనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు"...అని ఆకుల సత్యనారాయణ అనుమానాలు వ్యక్తం చేశారు. బిజెపి అనుమానాలపై స్పందించిన సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు...సందేహాలు నోట్ చేసుకున్నాం అధ్యక్షా...వాటిని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామని బదులిచ్చారు.

Have a great day!
Read more...

English Summary

Amaravathi:AP CM Chandra Babu criticised that BJP government says only words and it does not show works in the hands.