విజయమ్మతో కలిసి వైఎస్సార్ కు జగన్ నివాళి..!!

మాజీ సీఎం జగన్ తన తండ్రి వైఎస్సార్ కు నివాళి అర్పించారు. వైఎస్సార్ జన్మదినం సందర్భం గా కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ.. భారతి సహా పలువురు పార్టీ నేతలు జగన్ తో కలిసి నివాళి అర్పించారు. వైఎస్సార్ తీసుకొచ్చిన సంస్కరణలు..అమలు చేసిన పథకాలను పార్టీ నేతలు ప్రస్తావించారు. జగన్ పులివెందులలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

Advertisement

మాజీ సీఎం జగన్ ఇడుపులపాయలో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించారు. వైఎస్సార్ 77వ జన్మదినం సందర్భంగా తల్లి విజయమ్మ, భారతి సహా పలువురు కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు చేరుకున్నారు. రెండు రోజులుగా పులివెందులలో ఉన్న జగన్ ప్రజాదర్భార్ నిర్వహించారు. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. టెట్ పరీక్ష పైన పలువురు ఉపాధ్యాయులు జగన్ ను కలిసారు. ఈ సమస్య పైన కేంద్రంతో చర్చిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అవినాశ్ రెడ్డి సహా పార్టీ నేతలతో స్థానిక అంశాల పైన చర్చించారు. వారికి కీలక దిశా నిర్దేశం చేసారు. స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. కేడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, ఈ రోజు ముఖ్య నేతలతో కలిసి ఇడుపులపాయకు వచ్చారు.

Advertisement

తల్లి విజయమ్మ...కుటుంబ సభ్యులతో కలిసి

వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ సైతం ఇందులో పాల్గొన్నారు. జగన్ ను విజయమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. తరువాత ఇడుపులపాయలో ముఖ్యులతో జగన్ సమావేశమయ్యారు. పులివెందులతో సహా రాష్ట్రంలోని అంశాల పైన చర్చించారు. ఇక, వైఎస్సార్ జన్మదినాన్ని వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. పార్టీ ప్రధాన కార్యాలయంలోనూ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

English Summary

YS Jagan paid tributes to his father the late Y.S. Rajasekhara Reddy at YSR Ghat at Idupulapaya along with family members