టార్చర్ చేసారు.. జగన్ కీలక ప్రకటన..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. సిఐ నాగరాజు 3నెలలుగా వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా క్రాంతి కుమార్ చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ తెలిపారు. క్రాంతికుమార్ పై ఎటువంటి కేసులు లేవని, అయినా స్టేషన్ కు రావాలంటూ టార్చర్ చేసారని తెలిపారు. టాక్సీ నడుపుతూ జీవిస్తున్న వ్యక్తిని వేధించడంతో ఆయన కుటుంబం క్రాంతికుమార్ ని కోల్పోయిందని ఆగ్రహించారు.

Advertisement

పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శించారు. సిఐ నాగరాజు 3నెలలుగా వేధిస్తున్నారం టూ సెల్ఫీ వీడియో ద్వారా క్రాంతి కుమార్ చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ తెలిపారు. క్రాంతికుమార్ పై ఎటువంటి కేసులు లేవని, అయినా స్టేషన్ కు రావాలంటూ టార్చర్ చేసారని తెలిపారు. టాక్సీ నడుపుతూ జీవిస్తున్న వ్యక్తిని వేధించడంతో ఆయన కుటుంబం క్రాంతికుమార్ ని కోల్పోయిందని ఆగ్రహించారు. పోలీసులు చేయకూడని పనులు క్రాంతికుమార్ చేయాలని వేధించి, పేద కుటుంబానికి అండ లేకుండా చేశారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన వీడియో ఫ్యూటేజ్ మాయం అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

కుటుంబానికి అండగా నిలుస్తాం

ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడని.. తన చావుకు కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు మాత్రమే కారణమని, ఆయన వేధింపుల వల్లే తాను ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ వీడియోలో క్రాంతి కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడని జగన్ చెప్పుకొచ్చారు. స్థానిక పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రాంతి కుమార్ స్పష్టంగా రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ.. పోలీసులు దానిని ఎందుకు 'మరణ వాంగ్మూలం' గా పరిగణించడం లేదని ఆయన నిలదీశారు. నిందితుడైన మాజీ సీఐ నాగరాజుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, దళిత యువకుడి మృతికి న్యాయం చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

English Summary

YS Jagan Consoles Kranthi Kumar's Family in Vijayawada, made key comments against Govt