ప్రభుత్వం పై వైసీపీ 'బీసీ' అస్త్రం - భారీ సభలు, కీలక నిర్ణయాలు..!!

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ కొత్త రాజకీయం మొదలు పెట్టాయి. రెండు వైపులా 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ సామాజిక సమీకరణం మొదలు పెట్టింది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి చెందిన కాపు నేతలు సమావేశం అయ్యారు. ఇప్పుడు అదే పార్టీ బీసీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ భారీ సభలు.. సమావేశాలకు సిద్దం అవుతున్నారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వం పైన సామాజిక అస్త్రాలను ఎక్కు పెట్టింది. పార్టీ బీసీ నేతలు సమావేశం నిర్వహించారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. బీసీల ఓట్లతో గెలిచి, రెండేళ్ల పాలనలో వారికిచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలుచేయలేదని మండిపడ్డారు. వరలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాల్ని వివరిస్తామని ప్రకటించారు. రెండేళ్ల కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు ఏం చెప్పారు, ఎలా మోసం చేశారన్న దానిపై జనాలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో విజయవాడ నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేతలంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు. జోనల్ వారీగా ఈ కార్యాచరణ ఉండేలా డిసైడ్ చేసారు.

Advertisement

విజయవాడలో సభల.. జిల్లాల వారీగా సమావేశాలు

అదే విధంగా బలహీన వర్గాలంతా ఒక్కటే, అంతా ఒక్క తాటిపైకి వచ్చి బలవంతులుగా మారి శక్తివంచన లేకుండా పోరాడతామని మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రకటించారు. 2014-19 మధ్య చంద్రబాబు తన పాలనలో బీసీ అయిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎంగా కొనసాగించారని.. తమ ప్రభుత్వ హయాంలో బీసీలతో పాటు మొత్తం ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎంలుగా పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు రెండేళ్లుగా బీసీ వర్గానికి ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకూ, అమలుకూ ఏమాత్రం పొంతన లేదని పిల్లి సుభాష్ చంద్రబాబు ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల బీసీ వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నాయని, వారికిచ్చిన హామీలకు ఎందుకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోవ డం వల్ల కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని... ఫీజును తల్లితండ్రులు అప్పులు చేసి చెల్లించాల్సి వస్తోందని ఆరోపించారు.

English Summary

YSRCP BC leaders have decided on a new action plan against the Govt , alleging injustice to Backward Classes and announcing a series of programmes