COVID-19: నా చావుకు సీఎం, ఆయన కొడుకు, మంత్రి కారణం, శాపం పెట్టిన సినీ డైరెక్టర్, మీది ఒక ?


బెంగళూరు: మహానుభావుడు ముఖ్యమంత్రి మా ఇంటి వరకు కరోనా వైరస్ ను పంపించి నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చేటట్లు చేశారు. సీఎం గారికి, ఆయన కొడుక్కి, ఆరోగ్య శాఖా మంత్రికి ధన్యవాదాలు అంటూ ఓ టాప్ సినీ డైరెక్టర్ వ్యంగంగా అన్నారు. నాకు కరోనా వచ్చిందని, నేను చచ్చిపోతే అందుకే సీఎం, ఆయన కొడుకు, ఆరోగ్యశాఖా మంత్రితో పాటు ఈ ప్రభుత్వం కారణం అని తాను డెత్ నోట్ రాసిపెడుతున్నానని ఆ సినీ దర్శకుడు మండిపడ్డారు. ఏడాది నుంచి మీరు ఏం చేశారు ?, రెండు నెలలకు పైగా లాక్ డౌన్ పెట్టి మీరు ఏం సాధించారు ?, పేదోడి ఇంటి నుంచి ఒక్కొక్క ఇడ్లీ తీసుకెళ్లి మీ లాకర్లో పెట్టుకుని రోజూ తింటున్నారు (డబ్బులు), మీది ఒక జీవితమేనా అంటూ ఆ సినీ దర్శకుడు ప్రభుత్వం మీద విరుచుకుపడటం కలకలం రేపింది.

Psycho: భార్య, పిల్లలు హత్య, లేడీ ట్యూషన్ టీచర్ ను చంపేసి భార్య పక్కలో శవంతో సెక్స్, లాస్ట్ లో ?

ప్రముఖ దర్శకుడికి కరోనా పాజిటివ్

స్యాండిల్ వుడ్ ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు మఠ గురుప్రసాద్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. రోజురోజుకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని సినీ దర్శకుడు మఠ గురుప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సినీ దర్శకుడు గురుప్రసాద్ విడుదల చేసిన వీడియో కన్నడ టీవీ చానల్స్ తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సీఎం, ఆయన కొడుక్కి చాలా థ్యాక్స్

మహానుభావుడు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మా ఇంటి వరకు కరోనా వైరస్ ను పంపించి నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చేటట్లు చేశారు. సీఎం యడియూరప్ప గారికి, ఆయన కొడుకు విజయేంద్ర, కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ కు చాలాచాలా ధన్యవాదాలు అంటూ టాప్ సినీ దర్శకుడు గురుప్రసాద్ ఆయన విడుదల చేసిన వీడియోలో వ్యంగంగా అన్నారు.

ప్రతి పేదోడి ఇంట్లో ఇడ్లీలు మీ లాకర్ లోనా ?

మీరు ప్రజలను పాలించడం లేదు, రాజకీయం చేస్తున్నారు, ఇది మీకు మంచిది కాదు అంటూ సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ కు చివాట్లు పెట్టారు. మీరు ప్రతిపేదోడి ఇంట్లోని ఒక్కొక్క ఇడ్లీని తీసుకెళ్లి మీ ఇంట్లోని లాకర్ లో పెట్టుకుని తింటున్నారు (డబ్బులు), ఇది మీకు మంచిదికాదు, ఆ ఇడ్లీలు చాలా రోజులు ఉండవు అని గుర్తుపెట్టుకోండి అంటూ కర్ణాటక ప్రభుత్వం మీద సినీ దర్శకుడు గురుప్రసాద్ విరుచుకుపడ్డారు.

నా చావుకు మీరే కారణం.....డెత్ నోట్ రాసిపెడుతున్నా

కరోనా వైరస్ చికిత్స విఫలమై తాను చనిపోతే నా చావుకు సీఎం బీఎస్. యడియూరప్ప, ఆయన కొడుకు విజయేంద్ర, కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ తోపాటు ఈ ప్రభుత్వం కారణమని తాను డెత్ నోట్ రాసి పెడుతానని సినీ దర్శకుడు గురుప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

నా శాపం ఊరికే పోదు... మిమ్మల్ని వెంటాడుతుంది


ఏడాది నుంచి కరోనా కట్టడికి మీరు ఏం చేశారు ?, రెండు నెలలకు పైగా లాక్ డౌన్ పెట్టి మీరు ఏం సాధించారు ?, అని కర్ణాటక ప్రభుత్వాన్ని సినీ దర్శకుడు గురుప్రసాద్ నిలదీశారు. నాతో పాటు కరోనాతో చనిపోయిన ప్రతి ఇంటి కుటుంబ సభ్యుల శాపనార్తాలు మిమ్మల్ని చివరి వరకు వెంటాడుతాయని గురుప్రసాద్ ఆరోపించారు.

మా ఉసురు తగులుతుంది

మా ఉసుకు మీకు కచ్చితంగా తగులుతుంది, అందులో డౌట్ లేదు, మీరు ఇలాగే పాలిస్తే ప్రతి ఇంట్లో రెండు శవాలు పైకి లేస్తాయని, మీరు జీవితాంతం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని, ఇలాంటి కుళ్లు రాజకీయాలు చేస్తున్న మీది ఒక జీవితమేనా అంటూ ఆ సినీ దర్శకుడు గురుప్రసాద్ ప్రభుత్వం మీద విరుచుకుపడటం కలకలం రేపింది.

Read more...

English Summary

COVID-19: Kannada cinema Director Mata Guruprasad outrage against CM Yediyurappa and Minister Dr.Sudhakar for failed to control coronavirus.