భారీ పతనానికి సిద్ధమవుతున్న బంగారం.. క్లూస్‌ ఇవే!

బంగారం కొనాలనుకునే వారికి పండగలాంటి వార్త, పెట్టుబడిదారులకు నిద్రలేని రాత్రులు మిగిల్చే పరిణామం! అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొంతకాలంగా రికార్డు స్థాయిలకు చేరిన పుత్తడి వెలుగులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. జనవరిలో నమోదైన ఆల్‌టైమ్ గరిష్ఠ ధరలతో పోలిస్తే రాబోయే రోజుల్లో బంగారం ధర ఏకంగా 37 శాతం వరకు పతనమయ్యే అవకాశం ఉందంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా నివేదిక మార్కెట్ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది.

Advertisement

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,063 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది. అయితే, మార్కెట్ విశ్లేషణల ప్రకారం ధర గనుక 3,857 డాలర్ల దిగువకు పడిపోతే.. తర్వాతి ప్రధాన సపోర్ట్ లెవెల్ 3,500 డాలర్ల వద్ద ఉందనడంలో సందేహం లేదు. ఇదే గనుక జరిగితే, జనవరి గరిష్ఠాల నుంచి ఏకంగా 37 శాతం పతనం నమోదు కానుంది. గతంలో పసిడి మార్కెట్‌లో వచ్చిన పెద్ద కుదుపులను పరిశీలిస్తే, 3,500 డాలర్ల వద్ద స్థిరమైన నిలకడ (ఫ్లోర్) లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

విరుచుకుపడ్డ బంగారం ధరలు! భగ్గుమన్న వెండి

యెన్ పుంజుకుంటే పసిడికి కాస్తంత ఉపశమనం!

ఒకవైపు బంగారం ధర క్రమంగా తగ్గుతున్నా.. జపాన్ కరెన్సీ అయిన 'యెన్' రూపంలో పసిడికి కొంత మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా-జపాన్‌లు సంయుక్తంగా కరెన్సీ మార్కెట్‌లో చేపట్టిన చర్యల వల్ల యెన్ బలాన్ని పుంజుకుంటోంది. డాలర్ విలువ క్షీణించి, జపనీస్ యెన్ బలపడే ధోరణి ఇలాగే కొనసాగితే, అది బంగారం ధరలు మరింత ఘోరంగా పడిపోకుండా కొంతమేర రక్షణ కవచంలా నిలిచే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

Advertisement
మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!

ఫెడ్ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం!

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచడం, గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ఈటీఎఫ్ లలోకి వచ్చే పెట్టుబడులు మందగించడం పసిడి పతనానికి కారణమయ్యాయి. దీనికి తోడు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల్లో సడలింపులు వచ్చే సూచనలు కనిపించడం, ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణ భయాలు కాస్త తగ్గడం కూడా బంగారంపై ఒత్తిడి పెంచాయి. వచ్చే రోజుల్లో వెలువడే అమెరికా తయారీ, సేవా రంగాల ఆర్థిక గణాంకాలు పసిడి తదుపరి ప్రయాణాన్ని శాసించనున్నాయి.