ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు పింఛన్ల పంపిణీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఖాతాల్లో జమకావాల్సిన పింఛను సొమ్ము, ఆగస్టు 1 వచ్చినా అందకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యవస్థలో చేపట్టిన కొత్త సాఫ్ట్‌వేర్ మార్పులు, డేటాబేస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో లక్షలాది మందిపై ప్రభావం
సాధారణంగా ప్రతి నెలా 27వ తేదీ నాటికే ఈపీఎఫ్‌వో పింఛను సొమ్ము దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే ఈసారి సాంకేతిక మార్పుల వల్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీనివల్ల తెలంగాణలోని దాదాపు 4.63 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 3.29 లక్షల మంది పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెలాఖరు వచ్చినా చేతికి డబ్బులు రాకపోవడంతో నిత్యావసరాలు, వైద్య ఖర్చుల కోసం వారు అవస్థలు పడాల్సి వస్తోంది.
ఈపీఎఫ్‌వో ఇటీవల తన పాత సాంకేతిక వ్యవస్థ స్థానంలో సెంట్రలైజ్డ్ డేటాబేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన విధానం ద్వారానే దేశవ్యాప్తంగా పింఛన్లను ప్రాసెస్ చేసి మంజూరు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చెల్లింపుల ప్రాసెసింగ్ స్లాట్ శుక్రవారం నాటికి పూర్తయినట్లు తెలిసింది. దీంతో నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. సాంకేతిక చిక్కులు తొలగిపోవడంతో శనివారం లేదా సోమవారం నాటికి పింఛనుదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆలస్యం కేవలం జులై నెలకు మాత్రమే పరిమితమని, ఆగస్టు నుంచి యథాతథంగా పాత సమయానుకూల విధానంలోనే ఖాతాల్లోకి పింఛన్లు జమ అవుతాయని అధికారులు భరోసా ఇచ్చారు.EPFO VISHWAS 2026: కేంద్రం కొత్త స్కీమ్! ఆరు నెలలే టైమ్
సెంట్రలైజ్డ్ డేటాబేస్‌తో ముడిపడిన ప్రక్రియ
EPFO, LIC: వెలుగులోకి వచ్చిన కోట్ల రూపాయలు, పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన!
ఒకటి రెండు రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు!