నో బ్రేక్.. ఈ వారంలో రెండో రోజు కూడా పసిడి రేట్ల పతనం.. !!


దేశీయంగా బంగారం, వెండి ధరలు నేడు కూడాద తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వీటి రేట్లు క్షీణించడం ఈ వారంలో ఇది రెండోసారి. సాధారణంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది గానీ.. ఇక్కడి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉంటోన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పటికీ దేశీయ కమోడిటీలో బంగారం, వెండి ధరలు పతనం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

యుద్ధ భయాలతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచవచ్చనే అంచనాలు కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం తగ్గి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,421 వద్ద ట్రేడ్ అయింది. అలాగే సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రెండు శాతం నష్టపోయింది. కిలో రూ.2,17,090 స్థాయికి పడిపోయింది.

Advertisement

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,900, 22 క్యారెట్లు రూ. 1,30,990లకు లభిస్తోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,42,900, 22 క్యారెట్లు రూ. 1,30,990 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,45,080, 22 క్యారెట్లు రూ. 1,43,990 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,42,900 కాగా 22 క్యారెట్లు రూ. 1,31,990 పలుకుతోంది.

Advertisement
HCL: లేఆఫ్స్ తర్వాత బిగ్ స్టెప్: ఏఐపై రూ. వేల కోట్లు ఇన్వెస్ట్

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,346, 22 క్యారెట్లు - రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,970

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,280, 22 క్యారెట్లు- రూ. 13,090, 18 క్యారెట్లు - రూ. 10,710

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,280, 22 క్యారెట్లు- రూ. 13,090, 18 క్యారెట్లు - రూ. 10,710

Advertisement

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,280, 22 క్యారెట్లు- రూ. 13,090, 18 క్యారెట్లు - రూ. 10,710

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,280, 22 క్యారెట్లు- రూ. 13,090, 18 క్యారెట్లు - రూ. 10,710

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,280, 22 క్యారెట్లు- రూ. 13,090, 18 క్యారెట్లు - రూ. 10,710

English Summary

Gold and silver prices saw a slight dip as weakness in Global tensions and US interest rate expectations. The marginal differences in retail prices are influenced by brand-specific pricing policies, procurement costs, and regional market conditions.