బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. గత మూడు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టి ఊరటనిచ్చిన పసిడి ధరలు.. ఒక్కసారిగా మళ్లీ పైకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం. పశ్చిమాసియాలో (Middle East) ఉద్రిక్తతలు సద్దుమణగకపోవడంతో పాటు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన తాజా ప్రసంగం బులియన్ మార్కెట్‌కు పెద్ద బూస్ట్‌లా పనిచేసింది. వడ్డీ రేట్ల పెంపుపై సాగుతున్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు బ్రేక్ వేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోగా, భారత మార్కెట్లో మాత్రం ఈ రోజు పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జూలై 2) నమోదైన సరికొత్త రికార్డు స్థాయి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నేడు గ్రాముల వారీగా చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగే వెండి ధర కూడా ఊహించని రీతిలో భారీగా పెరిగింది. దేశంలో నేడు గ్రాము వెండి ధర రూ. 250 పలుకుతుండగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,50,000 మార్కును తాకింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకే రకంగా స్థిరంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. Silver: ఒక్కరోజే ఏకంగా 10 వేలు పతనం! పసిడి రేట్లు ఎలా ఉన్నాయి ధరలు ఒక్కసారిగా ఊహించని రేంజ్‌కు పెరగడంతో అటు సామాన్య కొనుగోలుదారులు అయోమయంలో పడగా, ఇటు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు సైతం పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.పెరిగిన ధరలు: గ్రాముల్లో చూస్తే..
తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు (10 గ్రాములకు)
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలు (10 గ్రాములకు)