నేల కూలుతున్న బంగారం ధరలు.. !!

దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది. నేడు వాటి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతలతో పాటు అమెరికా డాలర్ విలువ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘ కాలం పాటు అధికంగానే ఉంచవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోన్నాయి. ఇవన్నీ కూడా బంగారం ధరల్లో ఓ మోస్తరు తగ్గుదలకు కారణం అయ్యాయి.

Advertisement

నిజానికి శుక్రవారం నాడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి ఫ్యూచర్స్ 1.30 శాతానికి పైగా పెరిగింది. రికార్డు స్థాయిలో 10 గ్రాములకు రూ. 1,47,640 వద్ద ముగిసింది. అదేవిధంగా వెండి ఫ్యూచర్స్ కూడా 1.62 శాతంపైగా లాభపడి కిలో 2.37,720 లక్షల వద్ద స్థిరపడింది. క్లోజింగ్ సెషన్ సమయానికి ఈ తగ్గుదల రికార్డయింది. ఇది.. రిటైల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్లు, అలాగే అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధరలు నగరాల వారీగా భిన్నంగా ఉంటోన్నాయి.

Advertisement

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 22 క్యారెట్ల బంగారానికి గ్రాముకు రూ. 13,475 చొప్పున కోట్ చేస్తున్నాయి. తనిష్క్ జ్యువెలరీలో 22 క్యారెట్ల పసిడి గ్రాము ధర రూ. 13,491 వద్ద స్థిరపడింది. అలాగే జ్యువెలరీ వర్గాల అంచనా ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధరలు తనిష్క్‌లో రికార్డు స్థాయిలో రూ. 14,716 వద్ద కదలాడుతోంది. దేశీయ మార్కెట్‌లో బ్రాండ్ల వారీగా ఉండే మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నుల కారణంగా ఈ ధరలలో స్వల్ప మార్పులు సంభవిస్తుంటాయి.

Advertisement

పసిడి ధరలకు తోడు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు భారంగా మారుతున్నాయి. సాధారణంగా వెండిని పూజా సామాగ్రి, బహుమతుల కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. గత కొద్ది రోజులుగా స్థానిక మార్కెట్లలో వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో వెండి రేట్లు మిగిలిన నగరాల కంటే కొంత మేర ఎక్కువగా ఉండడం గమనార్హం.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,946, 22 క్యారెట్లు - రూ. 13,700, 18 క్యారెట్లు - రూ. 11,440

Advertisement

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

English Summary

Gold Price Inches Down as Stronger USD and Fed Rate Hopes Dent Demand 24K and 22K of Yellow Metal. Gold and silver prices saw a slight rise on Saturday, July 4, as weakness in international bullion markets weighed on domestic rates. Silver futures rose over 1.62% to close above 2.37 lakh per kilogram.