బంగారం ధరల్లో స్ట్రాంగ్ ర్యాలీ- అటు వైపు పరుగులు

దేశీయంగా నేడు పసిడి, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి రేట్లు పెరిగాయి. పరుగులు పెడుతున్నాయి. కిందటి నెలలో భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ నెల ఆరంభం నుంచే ఫర్వాలేదనిపించుకుంటోన్నాయి. లాభాలబాట పడుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో కొద్ది రోజులుగా ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.

Advertisement

ఈ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,280 వద్ద నమోదైంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,257 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో 999 ఫైన్ వెండి ధర దేశవ్యాప్తంగా రూ.2,22,130 వద్ద స్థిరపడింది. 925 స్టెర్లింగ్ వెండి ధర రూ.2,05,470 వద్ద నిలకడగా కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇప్పటివరకు వెండి ధరల్లో ఆరు శాతం క్షీణత కనిపించింది.

Advertisement

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,250, 22 క్యారెట్లు రూ. 1,32,229 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి రూ. 2,22,080 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి రూ. 1,44,440 కాగా 22 క్యారెట్లు రూ. 1,32,403 కు చేరుకుంది. ఇక్కడ వెండి కిలో ఒక్కింటికి రూ. 2,22,380 ఉంటోంది. బెంగళూరులో వీటి ధరలు 24 క్యారెట్లకు రూ. 1,44,130, 22 క్యారెట్లకు రూ. 1,32,119 వద్ద స్థిరపడ్డాయి. వెండి కిలో రూ. 2,21,910 గా రికార్డయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,020 కాగా 22 క్యారెట్లు రూ. 1,32,018 వద్ద నిలిచింది.

Advertisement
అజిత్ అగార్కర్ కు మూడింది: చీఫ్ సెలెక్టర్ రేసులో మనోడే ఫ్రంట్ రన్నర్.. !!

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,575, 22 క్యారెట్లు - రూ. 13,360, 18 క్యారెట్లు - రూ. 11,175

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,575, 22 క్యారెట్లు- రూ. 13,360, 18 క్యారెట్లు - రూ. 10,931

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,575, 22 క్యారెట్లు- రూ. 13,360, 18 క్యారెట్లు - రూ. 10,931

Advertisement

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,575, 22 క్యారెట్లు- రూ. 13,360, 18 క్యారెట్లు - రూ. 10,931

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,575, 22 క్యారెట్లు- రూ. 13,360, 18 క్యారెట్లు - రూ. 10,931

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,575, 22 క్యారెట్లు- రూ. 13,360, 18 క్యారెట్లు - రూ. 10,931

English Summary

Gold prices in India witnessed a strong rally in 24K, 22K and 18K Yellow Metal Rates increased Today at MCX. The price of 24K gold stood at Rs 1,44,280 per 10gm at the pan-India level, while 22K gold was at Rs 1,32,257 per 10gm.