అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అస్థిరతల కారణంగా భారత్ లో బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తోన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని సృష్టించాయి. ఈ భౌగోళిక పరిణామాలతో పాటు డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తూ వస్తోన్నాయి. ధరల పెరుగుదలపై ఒత్తిడి పడటంతో పసిడి విలువ ఒడిదుడుకులకు లోనవుతోంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన పసిడి ఫ్యూచర్స్ ప్రారంభంలోనే ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే.. స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయల మేర పెరిగింది. రూ. 1,42,992 వద్ద లావాదేవీలను నమోదు చేసుకుంది. గరిష్టంగా రూ. 1,42,518 ని తాకిన బంగారం ధర.. ఆ తర్వాత స్థిరత్వాన్ని కోల్పోయింది.
అటు వెండి ధరలు కూడా గణనీయంగా క్షీణించాయి. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ నెల డెలివరీ వెండి ఫ్యూచర్స్ క్రితం ముగింపు రూ. 2,19,375 కంటే రూ. 1,095 తగ్గింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి క్రమంగా పెరగడంతో దాదాపు ఒక శాతం వరకు నష్టపోయి కిలో రూ. 2,17,325 కనిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో వెండి గరిష్టంగా రూ. 2,20,000 మార్కును తాకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగే వరకు బులియన్ మార్కెట్ లో ఒడిదొడుకులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు స్థానిక ధరలను నిరంతరం గమనిస్తూ తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరల్లో నెలకొన్న ఈ పరిణామాలు కొనుగోలుదారులను ఒకింత ఆందోళనలకు గురి చేస్తోన్నాయి. చెన్నై.. 24 క్యారెట్లు- రూ. 13,509, 22 క్యారెట్లు - రూ. 13,300, 18 క్యారెట్లు - రూ. 11,115 ముంబై.. 24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870 బెంగళూరు.. 24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870 హైదరాబాద్.. 24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870 విజయవాడ.. 24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870 విశాఖపట్నం.. 24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు- హాల్ట్ స్టేషన్లు