పండగ సీజన్ వేళ.. బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం: అయినా

దేశంలో బంగారం, వెండి కొనుగోలుదారులకు నేడు స్వల్ప ఉపశమనం లభించింది. కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన పసిడి ధరలు నేడు మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం, అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధరల్లో ఈ తగ్గుదల నమోదైంది. పండగలు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న తరుణంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు జోష్ నింపుతోంది. వచ్చే వారం వీటి ధరల్లో ఎటువంటి కదలికలు ఉంటాయనేది కొనుగోలుదారులను ప్రభావితం చేయనుంది.

Advertisement

నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 380 రూపాయల మేర తగ్గింది. 1,44,220 వద్ద ట్రేడ్ అయింది. సాధారణ వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండే 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర 10 గ్రాములకు 350 రూపాయల వరకు తగ్గి రూ. 1,32,200 ని తాకింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర సైతం తగ్గింది. 10 గ్రాములకు 290 మేర పడిపోయింది. రూ. 1,08,160 వద్ద ట్రేడ్ అయింది.

Advertisement

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,32,200 ఉండగా, 24 క్యారెట్ల రూ. 1,44,220 గా నమోదైంది. బెంగళూరు, తిరువనంతపురం ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే సరళి కొనసాగుతోంది. చెన్నైలో వీటి రేట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,45,300, 22 క్యారెట్లు రూ. 1,33,650, 18 క్యారెట్లు రూ. 1,10,300 వద్ద కొనసాగుతోంది.

వంటగ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్రం భారీ ఊరట

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

Advertisement

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,461, 22 క్యారెట్లు - రూ. 13,256, 18 క్యారెట్లు - రూ. 11,035

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

English Summary

Gold prices traded higher across India on Saturday, August 1, tracking gains in the international bullion market, while silver prices remained firm at elevated levels. Investors continued to favour precious metals amid global economic uncertainty.