నేల కూలుతున్న పసిడి రేట్లు- భారీగా తిరోగమనం

దేశంలో బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. బుధవారం దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. మంగళవారం నాటి ధరలతో పోలిస్తే నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.9 శాతం ప్యూరిటీ) ధర 10 గ్రాములకు రూ. 1,360 మేర క్షీణించి రూ. 1,45,250 వద్దకు చేరుకుంది. అదే విధంగా నగల తయారీకి సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం (91.6 శాతం స్వచ్ఛత) ధర కూడా రూ. 1,250 తగ్గి రూ. 1,33,140 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

18 క్యారెట్ల బంగారం ధరలో కూడా స్పష్టమైన తగ్గుదల కనిపించింది. మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే రూ. 1,030 తగ్గి, 10 గ్రాముల బంగారం రూ. 1,08,930 మార్కు వద్ద స్థిరపడింది. దేశంలో గత శుక్రవారం నుండి సోమవారం మధ్య కాలంలో పసిడి ధరలు ఉరుకులు పరుగులు పెట్టాయి. ఆ నాలుగు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ. 6,000 వరకు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రేట్లు తగ్గుదల బాట పట్టాయి. సామాన్యులకు కొంతమేర ఊరటనిస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం దేశంలో వివాహాల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్ది రోజులుగా ధరలు విపరీతంగా పెరగడంతో ఆందోళన చెందిన కొనుగోలుదారులకు వరుసగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు దేశీయ బంగారం మార్కెట్ సరళిని పూర్తిగా నిర్దేశిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ ఊపందుకోవడం, పెట్టుబడిదారుల నుంచి సురక్షితమైన ఆస్తిగా పిలిచే బంగారంపై డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Advertisement

కాగా చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,170 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,33,990 గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,45,400, 22 క్యారెట్ల పసిడి రూ. 1,33,290 వద్ద అందుబాటులో ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,45,250, 22 క్యారెట్లు రూ. 1,33,140 పలుకుతోంది. బెంగళూరులో 10 గ్రాముల ధర రూ. 1,45,250, 22 క్యారెట్లు రూ. 1,33,140, 18 క్యారెట్లు రూ. 1,08,930 మేర ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,45,250, 22 క్యారెట్లు రూ. 1,33,140, 18 క్యారెట్లు 1,08,930 వద్ద లభిస్తోంది.

English Summary

Gold Rates Today Slip by Rs 1360 as the 24K at Rs 145250 and 22K per 10g Stands At Rs 1,33,140. Spot gold prices in India today fell Rs 1,360 to Rs 1,45,250 per 10 grams for 24 karat gold (99.9% purity), against Rs 1,46,610 reported on Tuesday’s close.