భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు విదేశీ గడ్డపై ఊహించని షాక్ తగిలింది. ఉద్యోగుల పనివేళలను నిఘా ఉంచే ప్రక్రియలో అక్కడి కార్మిక చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లేబర్ కోర్టు తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల వ్యక్తిగత గోప్యత, పనివేళల నిబంధనలను పక్కనబెట్టి సొంత వ్యవస్థలను ఉద్యోగులపై రుద్దే ప్రయత్నం చేసిందంటూ కంపెనీకి రూ.2 కోట్ల భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఇన్ఫోసిస్ ప్రాంగణాల్లో ఉద్యోగుల హాజరు, వారు పనిచేసే వేళలను పర్యవేక్షించేందుకు రూపొందించిన టైమ్ ట్రాకింగ్ విధానంపై ఫ్రాన్స్ న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ దేశంలో కార్మిక హక్కులు, ఉద్యోగుల వ్యక్తిగత భద్రతా సంబంధిత చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. సంస్థ అవసరాల పేరుతో సిబ్బందిపై పరిమితికి మించిన నిఘా పెట్టడం, పారదర్శకత లోపించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ ఐటీ దిగ్గజానికి జరిమానా విధించింది.
యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇన్ఫోసిస్ విస్తృతంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. డిజిటల్ రంగానికి నిలయమైన ఫ్రాన్స్‌లో స్థానిక కార్మిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. పనిచేసే గంటల నుంచి మొదలుకొని డిజిటల్ సాధనాల వినియోగం వరకు ప్రతి అంశంలోనూ ఉద్యోగుల హక్కులకు అక్కడి చట్టాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇలాంటి వేళ ఒక దిగ్గజ సంస్థ కార్మిక నియమాలను పాటించడంలో విఫలమైందంటూ తీర్పు రావడం యూరప్‌లో ఉన్న బహుళజాతి కంపెనీలన్నింటికీ పెద్ద పాఠంగా మారింది. ఫ్రాన్స్ లేబర్ కోర్టు తీర్పుపై ఇన్ఫోసిస్ యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. తమ కార్యకలాపాలు సాగించే ఏ దేశంలోనైనా స్థానిక చట్టాలకు, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని గతంలో పలుమార్లు చెప్పిన ఈ దిగ్గజం.. ప్రస్తుత తీర్పుపై ఏ రకంగా ముందడుగు వేస్తుందో వేచి చూడాలి. కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాలు పెరిగాయి. దీనికి అనుగుణంగా ఉద్యోగుల పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు సంస్థలు రకరకాల సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే ఇవి ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను హరించేలా ఉండకూడదని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు గ్లోబల్ ఐటీ కంపెనీల నిఘా ధోరణికి గట్టి హెచ్చరికలా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఐరోపా మార్కెట్‌లో కఠిన సవాలు
Nirmala Sitharaman స్ట్రాంగ్ వార్నింగ్! వారి బాధలు అర్థం చేసుకోండి..
ఇన్ఫోసిస్ మౌనం.. గమనిస్తున్న ఐటీ వర్గాలు
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు- రెండు విడతల్లో- 20 వేల ఫ్రెషర్లకు చోటు..!
ట్రాకింగ్ టూల్స్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నిఘా