లాభాల బాట పట్టిన బంగారం ధరలు- బిగ్ బెట్

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత లేకపోవడంతో పసిడి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. నేడు బంగారం, వెండి ధరలు స్వల్ప లాభాల బాట పట్టాయి. కామెక్స్ (Comex) లో స్పాట్ గోల్డ్ ధర 0.16 శాతం లాభపడి ఔన్సుకు 4,113.60 డాలర్లకు చేరుకుంది. అదే బాటలో వెండి సైతం గణనీయంగా పెరిగింది. స్పాట్ వెండి ధర దాదాపు 0.78 శాతం మేర పెరిగి ఔన్సుకు 58.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement

వివిధ దేశాలలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా వీటి ధరల పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. దేశీయ మార్కెట్ లోనూ ఈ పసిడి ధరల మార్పు ప్రభావం చూపుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో స్పాట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,42,295 వద్ద నిలిచింది. అక్టోబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు కింద పసిడి ధర 0.13 శాతం స్వల్ప వృద్ధితో 10 గ్రాములకు రూ. 1,43,557 కు చేరింది. అదే సమయంలో సెప్టెంబర్ డెలివరీ కోసం వెండి ఫ్యూచర్స్ ధర కేజీ రూ. 2,18,061 వద్ద సాగుతోంది.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెడ్జ్ ఫండ్స్, ఇతర పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్ల గమనంపై చూపు సారించారు. ఫెడ్ కఠిన వడ్డీ రేట్ల విధానాల నుండి ఎప్పుడు వెనక్కి తగ్గుతుందనే దానిపై మార్కెట్ విశ్లేషిస్తోంది. దేశీయంగా పండుగల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారానికి సాధారణ డిమాండ్ ఏర్పడుతోంది. అయినప్పటికీ భవిష్యత్తులో వచ్చే ఆర్థిక మార్పులను అంచనా వేయడానికే ప్రాధాన్యత ఇస్తోన్నారు. దీని మీదే బంగారం ఫ్యూచర్ ట్రేడింగ్ ఆధారపడి ఉంది.

ప్రశాంత్ కిశోర్ భవితవ్యం తేలుతోంది.. !!

ప్రపంచ ఆర్థిక స్థితిగతులు ఓ కొలిక్కి వస్తే తప్ప బులియన్ వ్యాపారంలో పెద్ద ఎత్తున సమీకరణాలు మారే అవకాశాలు కనిపించట్లేదు. తదుపరి ఫెడ్ విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల భవిష్యత్ దిశను పూర్తిగా శాసించనున్నాయి.

Advertisement

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,455, 22 క్యారెట్లు - రూ. 13,250, 18 క్యారెట్లు - రూ. 11,065

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

Advertisement

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

English Summary

MCX Gold Inches Up as Gains 0.16 and Silver Jumps 0.78 Percent Markets Weigh Fed Outlook Big Bets. Bullion surged marginally higher in early trade on August 3 as markets assess the uncertainty surrounding the US Federal Reserve's interest rate outlook.