కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఈ వారంలో ఇంకా తగ్గే అయ్యే ఛాన్స్?

దేశీయ మార్కెట్ లో ఈ నెల తొలి రోజే పసిడి ప్రియులకు ఊరట లభించింది. బంగారం ధరలు భారీగా పతనం కాగా, వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం నాటి ట్రేడింగ్‌లో దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 400 రూపాయల వరకు తగ్గింది. పసిడి ధరల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. కొనుగోలుదారుకు ఉపశమనాన్ని కలిగించింది. ఈ వారంలో కూడా ఈ పతనం కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

Advertisement

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా దాదాపు 1.5 శాతం మేర పడిపోయి ఔన్సుకు 4,043 డాలర్లకు చేరుకుంది. అదే బాటలో స్పాట్ వెండి ధర కూడా 2.4 శాతం వరకు బలహీనపడి ఔన్సుకు 57.62 డాలర్ల దిగువకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు దేశీయంగా ధరల క్షీణతకు ప్రధాన కారణం అయ్యాయి. వెండి ధరల్లో మాత్రం నిలకడ కనిపించింది. వీటి రేట్లు స్థిరంగా కొనసాగాయి.

Advertisement

జూలైలో బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కదలికలు కనిపించాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,600 దిగువన ముగిసింది. అలాగే ఎంసీఎక్స్ వెండి ధర కిలోకు రూ. 2,17,500 లోపు ట్రేడ్ అయింది. ఆ నెలలో బంగారం ధరలు దాదాపు రెండు శాతం కంటే ఎక్కువ మేర లాభపడగా, వెండి మాత్రం సుమారు 2 నుండి 3 శాతం వరకు నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలర్ బలోపేతం కావడం కూడా ఈ క్షీణతకు దారితీసింది.

Advertisement
సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు ఇచ్చిన మాట తప్పని డొనాల్డ్ ట్రంప్: ఇరాన్ పై..!!

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,461, 22 క్యారెట్లు - రూ. 13,256, 18 క్యారెట్లు - రూ. 11,035

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

Advertisement

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

English Summary

MCX Update as the Gold Ends July With Drop and Silver Drops Under Geopolitics Trigger Volatility Pressure. Gold rates and silver rates in India showed mixed trend on the first day of August month. On Saturday, Indian gold rates crash up to Rs 4,000.