MG Hector Hawk Hybrid: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ నెలలో భారత మార్కెట్లో తన మొదటి హైబ్రిడ్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది కంపెనీకి చెందిన సరికొత్త అడాప్ట్(ADAPT) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. ఈ నెల 26వ తేదీన(ఆగస్టు 26) కంపెనీ తన సరికొత్త న్యూ ఎనర్జీ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. కంపెనీ ఇంకా మోడల్ పేరును అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ.. ఇది 'హెక్టర్ హాక్' పేరుకో వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇది చైనా మార్కెట్లో ప్రజాదరణ పొందిన వులింగ్ స్టార్ లైట్ 560 ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది.
షేక్ హసీనాకు భారత్ తొలి షాక్- బంగ్లాదేశ్ హ్యాపీ- కీలక వ్యాఖ్యలు..!
ఈ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రెండు ఆప్షన్లలో అందించబడుతుంది. దీని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)వెర్షన్ ఒకే ఛార్జ్‌పై 1,100 కిలోమీటర్ల వరకు ఆకట్టుకునే మిశ్రమ రేంజ్‌ను అందించగలదు. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, అధునాతన భద్రతా సాంకేతికతను కలిగి ఉంటుంది. ఎంజీ నుంచి రాబోయే ఈ హైబ్రిడ్ మోడల్ టాటా-మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా వంటి కంపెనీల ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.
రెండు ఆప్షన్లలో లభించే హైబ్రిడ్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వేరియంట్ పవర్, మైలేజ్, ఛార్జింగ్ వివరాలు 1,100 కిమీ రేంజ్ ఇచ్చే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)వెర్షన్ స్పెసిఫికేషన్లు సూపర్ ఫీచర్లు, భద్రత
ఎంజీ నుంచి రాబోతున్న ఈ కొత్త ఎస్‌యూవీ రెండు శక్తివంతమైన వేరియంట్లలో అందుబాటులోకిరానుంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)వెర్షన్ పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండింటి కలయికతో ఇది పనిచేస్తుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్ వెర్షన్ పూర్తి స్థాయి బ్యాటరీ పవర్ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనంగా లభిస్తుంది.
స్టార్ లైట్ 560 ఆధారిత ఈవీ మోడల్ 56.7 KWH సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది 236 BHP పవర్, 200 NM టార్క్ ను ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సీఎల్టీసీ నిబంంధనల ప్రకారం 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది కేవలం 13 సెకన్లలోనే 0 నుంచి 100 KMPH వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని గరిష్ట వేగం 160 KMPH. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించినట్లయితే కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీని 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.భారత్ సెంచరీ ప్లస్ వన్: హిమాలయాల్లో మెరిసే వింత సరస్సుకు అంతర్జాతీయ గుర్తింపు
రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)వెర్షన్ అద్భుతమైన ఎంపిక కానుంది. ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 20.5 KWH, ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడతాయి. ఈ రెండింటి కాంబినేషన్ 197 BHP పవర్, 230 NM టార్క్ ను అందిస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లోనే ఇది 100 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండూ కలిపి ఉపయోగిస్తే ఒక్కసారి ఏకంగా 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
సరికొత్త ఎంజీ ఎస్‌యూవీలో ప్రీమియం ఫీచర్లకు కొదవ లేదు. కస్టమర్లను ఆకట్టుకునేలా క్యాబిన్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. . ఇందులో ప్రీమియం ఇంటీరియర్, 12.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 50W వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.