మరింత క్షీణించిన రూపాయి మారకం: రూ.72.66


మరింత క్షీణించిన రూపాయి మారకం: రూ.72.66

ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం మరింత క్షీణించింది. డాలర్‌కు డిమాండ్‌ పెరిగిపోతుండటంతో పాటు, ముడి చమురు ధరలు పెరగడం, కరెంట్‌ ఖాతా లోటు ఎక్కువగా ఉండటం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఊహించని విధంగా పతనమవుతోంది.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ 88 పైసలు నష్టపోయి 72.66 వద్ద జీవనకాల అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. క్రితం సెషన్‌లో 71.73 వద్ద ముగిసిన రూపాయి.. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీగా పతనమైంది.

72.18 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72.61 వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ చరిత్రలో రూపాయి విలువ ఇంతటి కనిష్ఠస్థాయిలో ఉండటం ఇదే తొలిసారి.

ఇది ఇలావుంటే, రూపాయి క్షీణత దేశీయ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చమురు ధరలు, రూపాయి పతనంతో ఆరంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు మధ్యాహ్నానికి కుప్పకూలాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయింది.

చరిత్రలో తొలిసారి: డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.12

ప్రస్తుతం 363 పాయింట్లు నష్టపోయి 38,028 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 118 పాయింట్ల నష్టంతో 11,471 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా, పెట్రో ధరల పెరుగుదల, రూపాయి క్షీణతపై కాంగ్రెస్ తోపాటు విపక్షాలు సోమవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి.

Have a great day!
Read more...

English Summary

Continuing its slide, the Indian rupee on Monday touched another fresh low of 72.66 amid high crude oil import costs and high US dollar demand.