ఈ పసివాడు బతకాలంటే గుండె ఆపరేషన్ చేయాలి: సాయం చేసి ఆదుకోండి


శస్త్రచికిత్స

"నా చిట్టి తండ్రి ముసి ముసి నవ్వులు నవ్వుతూ, చిన్ని చిన్ని కాళ్లతో గాలిని తన్నుతూ కిలకిలలాడడం చూశాను. కానీ ఆ పసికూన ఆడుకోలేని స్థితిలోకి వస్తాడని అనుకోలేదు. సంతోషంలో ఉన్న ప్రతిసమయం కేరింతలు కొడుతూ శబ్దం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గొంతు మూగబోకుండా కాపాడమని దేవుని వేడుకుంటున్నాము. మొదటి చూపులోనే నా బిడ్డ నా మనసు దోచుకున్నాడు. కానీ ఆ బంధం కలకాలం ఉంటుందా? నా బిడ్డ తిరిగి సంతోషంగా ఆడుకోవడం చూడగలనా ?" అని పసివాడి తల్లి షాలిని ఆవేదన చెందారు.

కొడుకు పుట్టగానే షాలిని, ఆమె భర్త ఎంతో సంతోషపడ్డారు. కొడుకు పుట్టగానే అతనికి పెట్టే పేర్ల గురించి ఆలోచిస్తూ ఆనందంగా గడిపారు ఆ దంపతులు. బట్టలు, బొమ్మలు కొనుగోలు చేసి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ నిర్వహించి తమ బిడ్డను వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలనుకున్నారు. కానీ వారి కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి.

ఆ సంతోషం కొద్దికాలం మాత్రమే:

"ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాం. ఆరోగ్యకరంగా ఉన్నమా బిడ్డ బోసి నవ్వులతో క్రమంగా ఇంటిల్లిపాదిని ఆనందాలతో నింపాడు. నా చిట్టితండ్రి నిద్రిస్తున్న సమయంలో, కుటుంబమంతా తన చుట్టూ చేరి నిద్ర లేపాలని ప్రయత్నించేది. వాడు నిద్ర లేచాక నేను, నా భర్త ఇద్దరమూ కలిసి చక్కిలిగింతలు పెడుతూ ఆడుకునేవాళ్లం. వాడి ముఖ కవళికలు చూస్తే భలే ముద్దేచ్చేది. అమాయకంగా మా వైపు చూస్తూ బోసి నవ్వులు నవ్వేవాడు. ఆ నవ్వులు ఇంకా మా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి." అంటూ ఏడ్చింది ఆ చిన్నారి తల్లి షాలినీ.

అందరు నవజాత శిశువుల మాదిరే సాధారణ వైద్య పరీక్షలు(రొటీన్ చెకప్స్)ఈ బాబుకు చేయించేవారు. అందుకోసం ఆ తల్లిదండ్రులు బాబును తీసుకుని ప్రతివారం పెరంబలూర్ నుంచి చెన్నైకి వెళ్లేవారు. ఇంటి నుండి చెన్నైకి చెక్ అప్ కోసం 7గంటల ప్రయాణం చేసేవారు బస్సు ప్రయాణాలలో అలసిపోయినా శిశువు ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడేవారు.

క్రమంగా సాధారణ వైద్య పరీక్షలలో భాగంగా బాబును ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు శిశువులో డాక్లర్లకు ఏదో లోపం కనిపించింది. క్రమంగా నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. షాలినీ ప్రసూతి సమస్యలతో సతమతమవుతున్న కారణాన అవసరమైన పరీక్షలను పూర్తి చేయడానికి కొంత వెనుకాడారు. కానీ వైద్యులు తప్పదని నిర్ధారించిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తిస్థాయిలో చేయించుకోవడానికి సిద్దపడ్డారు.

శిశువుకు పుట్టుకతో వచ్చే గుండెవ్యాధి ఉందని, దీనికి గుండె శస్త్రచికిత్స మాత్రమే మార్గమని వైద్యులు ధృవీకరించారు. ఆ కుటుంబంలో సంతోషాలకు వారధిలా ఉన్న బాబు గుండె సమస్యతో భాదపడుతుంటే తల్లిదండ్రులు మదనపడ్డారు.

గుండె శస్త్రచికిత్స మాత్రమే వారి కుమారుడిని కాపాడగలదు:

శస్త్రచికిత్సకు సుమారుగా రూ.4 లక్షలు. ఖర్చు అవుతుంది. షాలిని భర్త, ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో వెయిటర్ గా పని చేస్తుంది. నెలకు వచ్చే రూ.10,000 జీతంతో బతుకు బండిని ఈడుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు బాబును కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రయాణ ఖర్చులకు (చెన్నై, పెరంబాలూర్ నుంచి ప్రయాణము) షాలిని ప్రసవానికి, శస్త్రచికిత్స ఖర్చులకు వారికున్న చిన్న చిన్న వస్తువులను సైతం విక్రయించారు. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే ఆశ తప్ప వారి వద్ద ఇంకేమీ మిగలలేదు.

"నా బిడ్డ ఇప్పటికీ ధైర్యంగా ఉన్నాడు. ఆ పసివాడు అంత నొప్పిని ఎలా భరించగలుగుతున్నాడో ఊహించడానికే భయంగా ఉంది. తల్లిదండ్రులుగా మా బాధ వర్ణనాతీతం. తనను బతికించుకోవడానికి మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలనూ చేస్తాము. నా బిడ్డను ఆ దేవుడే బతికించాలి " అంటూ ఏడ్చిందిషాలిని.

మీరు ఎలా సహాయపడవచ్చు?

తల్లిదండ్రులు

వాట్సాప్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల ద్వారా ఈ పసిబిడ్డ గురించిన వివరాలను అందరితో పంచుకోవడం వల్ల నలుగురికీ ఈ విషయాన్ని చేరవేసిన వారవుతారు. క్రమంగా కొద్దో గొప్పో సహాయం జరగక పోదు. మానవతా విలువలు ఇంకా ఈ సమాజంలో ఉన్నాయని చూపాల్సిన బాద్యత అందరిదీ. ఆ పసిబిడ్డ ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. వారి బిడ్డను రక్షించడంలో అందరమూ చేయి చేయి కలుపుదాం.

Have a great day!
Read more...

English Summary

A Month Old Baby Struggles To Breathe Due To Heart Disease.