కేంద్రంలో భారీ ప్రక్షాళన- అర్ధరాత్రి వెలువడిన ఉత్తర్వులు

దేశంలో పరీక్షల నిర్వహణ లోపాలు, పేపర్ లీకేజీల వివాదం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. కేబినెట్ నియామకాల కమిటీ భారీగా బ్యూరోక్రాట్ల ప్రక్షాళనలో చేపట్టింది. కేంద్ర స్థాయిలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. వివిధ శాఖలకు నూతన కార్యదర్శులు నియమితులయ్యారు.

Advertisement

ధర్మేంద్ర ప్రధాన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విద్యా శాఖ కార్యదర్శి వినీత్ జోషిపై వేటు పడింది. ఆయనను ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. ఆయన స్థానంలో రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్‌.. నూతన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

Advertisement

ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ విద్యార్థి సంఘాలు పరీక్షల అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్నాయి. పరీక్షల వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనాన్ని తీసుకురావాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఈ బదిలీలపై ఎలాంటి అధికారిక రాజకీయ కారణాలను వెల్లడించలేదు.

సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ: కేంద్రం ఇచ్చిన హామీలు: కాక్రోచ్ పార్టీ రియాక్షన్

విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని మార్చాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్ లో వ్యాఖ్యానించారు. మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషిని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న వివేక్ భరద్వాజ్ స్థానంలో వినీత్ జోషి బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర పాఠశాల విద్య నూతన కార్యదర్శిగా టీకే అనిల్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

పశుసంవర్ధక, డెయిరీ విభాగంలో ప్రత్యేక అధికారిగా సుశీల్ కుమార్ లోహాని బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ బదిలీల్లో భాగంగా మరికొంత మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా కొత్త బాధ్యతలు దక్కాయి. గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న పీయూష్ గోయెల్‌ను ఎన్‌హెచ్ఆర్‌సీ సెక్రటరీ జనరల్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కేశవ్ చంద్ర గనుల శాఖ నూతన కార్యదర్శిగా నియామకం అయ్యారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న వందన గుర్నాని స్థానంలో చంద్ర భూషణ్ కుమార్ బాధ్యతలు అందుకోనున్నారు.

గుప్పెడు దోరగా వేయించిన శెనగలు తీసుకుంటే చాలు- ఎన్నెన్నో.. !!
Advertisement

ముస్సోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నూతన డైరెక్టర్‌గా సీనియర్ అధికారి బీ రాజేంద్ర నియమితులయ్యారు. ఈ నెల 31న శ్రీరామ్ తరణికాంతి పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన ఈ బాధ్యతలు చేపడతారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సేవల్లో సతేంద్ర సింగ్, డీ థారా కూడా బదిలీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా కటికితల శ్రీనివాస్‌ నియమితులయ్యారు.

క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సుచింద్ర మిశ్రాను జాతీయ మైనారిటీ కమిషన్ కార్యదర్శిగా నియమించారు. జాతీయ రహదారుల సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, నీతి ఆయోగ్ సలహాదారు రాజీవ్ సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు అధికారులకు కేంద్రం స్థాయిలో ఇన్ సిటు అప్‌గ్రేడేషన్ వర్తింపజేసింది.

English Summary

ACC Appoints Naresh Pal Gangwar as Secretary of Higher Education, Replaces Vineet Joshi Several others. Earlier, he served as Additional Secretary in the Ministry of Environment, Forest and Climate Change, where he handled issues related to pollution control.