ఎమ్మెల్యే పెళ్లి మళ్లీ అగిపోయింది. పెళ్లి కూతురు ఎస్కేప్, హ్యాండ్ ఇచ్చారు, 20 ఏళ్ల తేడా !


పెళ్లి కూతురు మారినా.. మారని ఎమ్మెల్యే జాతకం....!

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ (43) కు సినిమా కష్టాలు మొదలైనాయి. నిశ్చితార్థం జరిగిన అమ్మాయి ఇంటి నుంచి ఎస్కేప్ అయ్యి చివరికి ఎమ్మెల్యేతో పెళ్లికి నిరాకరించింది. ముందుగా నిర్ణయించిన అదే ముహుర్తానికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయినా ఆమె కుటుంబ సభ్యులు హాండ్ ఇవ్వడంతో చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది.

జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ ఇవ్వండి, అపోలోకు విచారణ కమిషన్ ఆదేశాలు!

బుధవారం పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన ఎమ్మెల్యే ఈశ్వరన్ కు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు షాక్ ఇచ్చారు. ఇంత త్వరగా పెళ్లి చెయ్యాలంటే వీలు కాదని, సమయం కావాలని, బంధువులు అందరినీ పెళ్లికి పిలవాలని చెప్పడంతో ఎమ్మెల్యే పెళ్లికి మళ్లీ బ్రేక్ పడింది.

అధికార పార్టీ ఎమ్మెల్యే

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని భవాని సాగర్ శాసన సభ నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే పార్టీ టిక్కెట్ తో ఈశ్వరన్ (43) ఎమ్మెల్యే అయ్యారు. ఈరోడ్ జిల్లాలో అన్నాడీఎంకే పార్టీలో ఈశ్వరన్ కీలకనేత. పార్టీ కార్యక్రమాల్లో ఈశ్వరన్ చరుకుగా పాల్గొంటున్నారు.

ఎంసీఏ అమ్మాయి

సత్యమంగళంలోని పెరియార్ ప్రాంతానికి చెందిన ఆర్. సంధ్యా (23) ఎంసీఏ పూర్తి చేసింది. తన కంటే 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న సంధ్యాను వివాహం చేసుకోవడానికి ఎమ్మెల్యే ఈశ్వరన్ సిద్దం అయ్యారు. కుటుంబ సభ్యులు ఒత్తిడి చెయ్యడంతో సంధ్యా ఎమ్మెల్యే ఈశ్వరన్ తో నిశ్చితార్థం చేసుకుంది.

పెళ్లికి పళని, పన్నీర్

సత్యమంగళం సమీపంలోని ప్రసిద్ది చెందిన బన్నారి అమ్మాన్ ఆలయంలో సెప్టెంబర్ 12వ తేదీ బుధవారం (ఈరోజు) ఉదయం ఎమ్మెల్యే ఈశ్వరన్, సంధ్యా పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. జయలలిత, సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం, ఎమ్మెల్యే ఈశ్వరన్, పెళ్లి కుమార్తె సంధ్యా ఫోటోలతో ఖరీదైన పెళ్లి పత్రికలు ముద్రించి అందరికీ పంచి పెట్టారు. సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఎమ్మెల్యే ఈశ్వరన్ పెళ్లికి ఆహ్వానించారు.

పెళ్లి కూతురు ఎస్కేప్

సెప్టెంబర్ 1వ తేదీ తాను సోదరి ఇంటికి వెలుతున్నానని సంధ్యా కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత రెండు రోజులు అయినా సంధ్యా ఆచూకి లేదు. సంధ్యా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలించారు. సంధ్యా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎమ్మెల్యే ఈశ్వరన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

పెళ్లి ఇష్టం లేదు

పోలీసులు సంధ్యాను ఆమె స్నేహితురాలి ఇంటిలో గుర్తించారు. పోలీసుల విచారణలో సంధ్యా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తన కంటే 20 ఏళ్లు వయసు ఎక్కువ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతోందని చెప్పింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి చెయ్యడంతో పెళ్లికి అంగీకరించానని, చచ్చినా ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోనని సంధ్యా పోలీసుల ముందు తేల్చి చెప్పింది.

పెళ్లి కూతురు మారినా ?

ముందుగా నిర్ణయించిన ముహుర్తానికి వేరే యువతితో ఎమ్మెల్యే ఈశ్వరన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ రోజు పెళ్లికి హాజరుకావడానికి సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు. అయితే చివరి నిమిషంలో బంధువులు, సన్నిహితులకు చెప్పకుండా ఇంత త్వరగా తాము పెళ్లి చెయ్యలేమని, మరో మంచి ముహుర్తం చూసి పెళ్లి చేస్తామని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరన్ షాక్ కు గురైనారు.

చివరి నిమిషయంలో హ్యాండ్ !

ఎమ్మెల్యే ఈశ్వరన్ పెళ్లి ఆగిపోయింది అని సమాచారం తెలుసుకున్న సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఈశ్వరన్ పెళ్లి ఆగిపోవడంతో ఆయన అనుచరులు షాక్ కు గురైనారు. ఎమ్మెల్యే ఈశ్వరన్ ఇంటి నుంచి బయటకు రావడం లేదని అన్నాడీఎంకే కార్యకర్తలు అంటున్నారు..

Have a great day!
Read more...

English Summary

Tamil NaduG: Erode district AIADMK MLA Eswaran marriage stopped again in Sathyamangalam.