అరుణాచలం. లక్షలాది మంది భక్తులు నిత్యం దర్శనం కోసం వచ్చే పవిత్ర ప్రదేశం. పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక్కడ గిరిప్రదక్షిణకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే మోక్ష మార్గం కు విశిష్ఠత ఉంది. దీంతో.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి .. బయటకు రావటం ప్రత్యేకంగా భావిస్తారు. కాగా,ఈ మధ్య కాలంలో ఇక్కడ చోటు చేసుకున్న కొన్ని ఘటనల తో అధికారులు కొన్ని నిబంధనలు మార్పు చేస్తూ.. టైమింగ్స్ ఖరారు చేసారు.
అరుణాచలం ఆలయానికి ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తారు. పౌర్ణమి రోజున మరింతగా రద్దీ కనిపిస్తోంది. అదే సమయంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు.. మోక్షమార్గం ను భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గుహా ఆకారంలో ఈ మోక్ష మార్గంలో గుహ ఆకారంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనుక ద్వారం గుండా పడుకుని లోపలికి ప్రవేశించి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీ. బయటకు వచ్చాక అక్కడే ఉన్న నందిని, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే, తాజాగా ఏపీకి చెందిన ఒక భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి మధ్యలోనే ఇరుక్కుపోయారు. కాసేపటికే మృతి చెందారు. దీంతో.. ఆలయ అధికారులు కొత్త నిబంధనలు ప్రకటించారు.
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!
అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు మోక్షమార్గంలో ప్రవేశానికి నిర్దిష్ట సమయాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు.. అలాగే సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ లో భాగంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందుకు కోసం ఆ ప్రదేశంలో గ్రిల్ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ఇనుప గ్రిల్ ను ఏర్పాటు చేశారు. దీనిని మోక్షమార్గం సైజుకు సమానంగా ఉండేలా తయారు చేశారు. ఈ గేటు ద్వారా లోపలకు వెళ్లగలిగిన వారినే ఆలయంలో ప్రస్తుతం ఉన్న మోక్షమార్గంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ముఖ్యంగా.. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శారీరక ఇబ్బందులు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఈ ఇరుకైన మార్గంలో వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. మోక్షమార్గంలోకి వెళ్లే ముందు భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.తాజా నిబంధనలు.. వేళల ఖరారు