ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వర స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఇక్కడ గిరిప్రదక్షిణకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే మోక్ష మార్గం కు విశిష్ఠత ఉంది. దీంతో.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి .. బయటకు రావటం ప్రత్యేకంగా భావిస్తారు. తాజాగా అక్కడ జరిగిన విషాద ఘటనతో ఈ మోక్షమార్గం లో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
అరుణాచలం ఆలయానికి ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తారు. పౌర్ణమి రోజున మరింతగా రద్దీ కనిపిస్తోంది. అదే సమయంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు.. మోక్షమార్గం ను భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గుహా ఆకారంలో ఈ మోక్ష మార్గంలో గుహ ఆకారంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనుక ద్వారం గుండా పడుకుని లోపలికి ప్రవేశించి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీ. బయటకు వచ్చాక అక్కడే ఉన్న నందిని, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే, తాజాగా ఏపీకి చెందిన ఒక భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి మధ్యలోనే ఇరుక్కుపోయారు.
TTD: శ్రీవారి సేవకులకు కొత్త బాధ్యతలు, రేటింగ్స్ - ఇక వీరికీ ఛాన్స్..!!
కాగా, ఆ భక్తుడిని అక్కడ ఉన్నవారు సురక్షితంగా బయటకు తీసేందుకు శ్రమించారు. కానీ, ఊపిరాడటానికి గాలి సరిపోక, ఆందోళన పెరిగిపోవడంతో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. కాసేపటికే మృతి చెందారు. దీంతో.. ఆలయ అధికారులు కొత్త నిబంధనలు ప్రకటించారు. మోక్ష మార్గంకు ముందే అదే తరహాలో.. అదే సైజులో ఒక గేటు ఏర్పాటు చేసారు. ఈ గేటు ద్వారా లోపలకు వెళ్లగలిగిన వారినే ఆలయంలో ప్రస్తుతం ఉన్న మోక్షమార్గంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అదే విధంగా భక్తులు రిస్కు తీసుకొని మోక్షమార్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయవద్దని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇక.. ఎంత మంది భక్తులు వచ్చినా సాధ్యమైనంత త్వరగా దర్శనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ నిబంధనలు పాటిస్తూ.. సహకరించాలని కోరుతున్నారు.భక్తుల భద్రత కోసం కొత్త నిర్ణయాలు