ఘోర రోడ్డు ప్రమాదం: అతీక్ అహ్మద్ కుమారుడితో సహా ఇద్దరు దుర్మరణం!

గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఝాన్సీలోని పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకోంది. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఝాన్సీ జైలులో ఖైదీగా ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలవడానికి వారందరూ ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Advertisement
భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!
Advertisement

సమాచారం ప్రకారం.. అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి హైవేపై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులలో ఒకరిగా అబాన్ అహ్మద్‌ను గుర్తించారు. ఈ ప్రమాదంలో మహమ్మద్ జైద్, ఒమర్‌తో సహా మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన పరిస్థితులు, కారు వేగంపైనా విచారణ జరుగుతోంది. పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement
డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

అబాన్ అహ్మద్ అతీక్ అహ్మద్ చిన్న కుమార్. ఉమేష్ పాల్ హత్య కేసు తరువాత అబాన్ అహ్మద్, అతని సోదరుడు ఆజమ్ మైనర్లు కావడంతో వారిని బాలల గృహంలో ఉంచారు. ఆ తర్వాత అక్టోబర్ 2023లో వారిద్దరినీ బాలల గృహం నుంచి విడుదల చేసి వారి అత్తకు అప్పగించారు.అతీక్ అహ్మద్ కుమారుడు అలీ అహ్మద్‌ను 2025 అక్టోబర్ 1న నైని జైలు నుంచి ఝాన్సీ జైలుకు బదిలీ చేశారు. అతడిని కలవడానికి అబాన్ అహ్మద్, అతని కుటుంబం ఝాన్సీకి ప్రయాణిస్తున్నారని సమాచారం. ఈ ఘటన అనంతరం పోలీసులు మొత్తం విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

English Summary

Atiq Ahmed Son Aban Ahmed was killed in a tragic road accident near Jhansi. Two others also lost their lives, while three sustained serious injuries as the family was reportedly travelling to meet Ali Ahmed in jail.