ఆకాశానికి నిచ్చెన వేసినట్లుండే ఎత్తైన పర్వతాలు, నిమిషానికో రంగు మార్చే దట్టమైన మేఘాలు, చెట్ల కొమ్మలను తాకుతూ సాగిపోయే పొగమంచు తెరలు.. నిత్యం ఉరిమే మేఘాలు ముద్దుపెట్టుకునే అందాల నిలయం 'మేఘాలయ'. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలుగా పేరుగాంచిన చిరపుంజి, మాసిన్‌రామ్‌లు ఉన్న ఈ నేలపై అడుగుపెడితే ఆకాశం నిరంతరం చినుకుల జల్లులు కురిపిస్తూనే ఉంటుంది. కానీ, ప్రకృతి దేవి కొలువైన ఆ వర్షాల రాజధానిలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ కుండపోత వానలతో మురిసిపోయే ఆ కొండల మధ్య ఇప్పుడు ఊహించని పొడివాతావరణం అల్లుకుంది. 'ఎల్‌నినో' ఎఫెక్ట్ ఫలితంగా ఆకాశంలో మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
సగానికిపైగా పడిపోయిన వర్షపాతం!
వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈశాన్య భారతాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి. జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వరకు మేఘాలయలో సాధారణంగా 632 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం 272 మిల్లీమీటర్ల వాన మాత్రమే కురిసింది. అంటే దాదాపు 57 శాతం మేర వర్షపాతం తగ్గిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతానికి వేదికగా నిలిచే ఈ ప్రాంతంలో ఇలా సగానికి పైగా వానలు తగ్గిపోవడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దేశంలో ఒకవైపు సెంట్రల్, నార్త్ ఇండియాలో తుఫానులు, తీవ్ర వాయుగుండాల ప్రభావంతో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం వర్షపు మేఘాలను ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వైపు మళ్లించింది. ఇన్శాట్-3డిఎస్ ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఈ గాలుల దిశ మారడం వల్ల తేమ అంతా పశ్చిమ, మధ్య భారతం వైపు వెళ్ళిపోయింది. ఫలితంగా మేఘాలయపై మేఘాల సాంద్రత తగ్గిపోయి, కేవలం తేలికపాటి చినుకులకే పరిమితమైపోయింది. మేఘాలయలోని మొత్తం 11 జిల్లాల్లో పది జిల్లాల పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క 'సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్' జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వర్షపాతం దారుణంగా పడిపోయింది. అత్యధికంగా వెస్ట్ జైంతియా హిల్స్‌లో 78 శాతం, వెస్ట్ గారో హిల్స్‌లో 69 శాతం దాకా క్షీణత నమోదైంది. ఇక చిరపుంజి ఉన్న 'ఈస్ట్ ఖాసీ హిల్స్' జిల్లాలో ప్రతీ ఏటా జూలై నెలలో దాదాపు 2,796 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి కేవలం 1,403 మి.మీ వర్షం మాత్రమే పడింది. అంటే సరిగ్గా 50 శాతం వర్షపాతం తగ్గిపోవడం ఇక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వర్షభావ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు, తాగునీటి ఎద్దడి, వరి, ఉద్యానవన పంటలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈశాన్య భారతంపై ఈ వానల కరువు శాశ్వతం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో మళ్లీ తేమ గాలులు పుంజుకుని, మేఘాల దారి తూర్పు వైపుకు మళ్లితే చిరపుంజి మళ్లీ తన పాత రూపానికి వస్తుందని, త్వరలోనే భారీ వర్షాలు నమోదు కావొచ్చని భావిస్తున్నారు.వానల రాక వెనుక దిశ మార్చిన గాలులు
Super El Nino :
చిరపుంజి జిల్లాలోనే 50 శాతం నిరాశ!
El Nino: చావు కబురు చల్లగా చెప్పిన ఐఎండీ- ఆగస్టులో వర్షాలపై తాజా అప్డేట్..!
ముందుంది మంచి కాలమేనా?