కర్ణాటక నేతలకు చింత లేకుండా శ్రీవారి చెంత మొదటి పూజా యోగం: సీఎం డీకే శివకుమార్


తిరుమల శ్రీవారి ఆలయంలో అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి పూజ, హారతి గౌరవాన్ని కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు కూడా వర్తింపజేస్తామంటూ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రొటోకాల్ లో కొన్ని మార్పులు చేస్తామని వెల్లడించారు. చాలామంది ఎమ్మెల్యేలు తిరుమల వచ్చినా దర్శనం చేసుకోలేకపోతున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

డీకే శివకుమార్ చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. పవిత్ర ఆలయ మర్యాదలు, వీఐపీ సంస్కృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రముఖుల సందర్శనలు, ప్రోటోకాల్ శైలిపై ఇప్పటికే సామాన్య భక్తులలో చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయాన్ని మంత్రులు స్వాగతిస్తోండగా.. బీజేపీ నాయకులు విమర్శిస్తోన్నారు.

Advertisement

అత్యంత విశిష్ట అతిథులు, రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి తిరుమల శ్రీవారి ఆలయంలో మొదటి పూజ, హారతిని ఇచ్చే సాంప్రదాన్ని టీటీడీ పాటిస్తోంది. ఇది సాధారణ దర్శనం కంటే భిన్నమైనది. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హారతి ఇచ్చి, దేవస్థానం తరఫున అధికారికంగా స్వామివారి ఆశీస్సులు, శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, న్యాయమూర్తులు వంటి ప్రముఖులకే ఈ సౌకర్యం పరిమితంగా ఉంటుంది.

దీనిపై మంత్రి రామలింగారెడ్డి మాట్లాడారు. దీన్ని స్వాగతిస్తోన్నామని అన్నారు. కర్ణాటకకు చెందిన ప్రజా ప్రతినిధులకు ఇకపై తిరుమల ఆలయంలో మరింత మెరుగ్గా దర్శన భాగ్యాన్ని కల్పించడానికి డీకే శివకుమార్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోన్నారని పేర్కొన్నారు. ఇందులో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులే కాకుండా రాష్ట్రానికి చెందిన డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖులు కూడా పాలుపంచుకోవచ్చని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

Advertisement

ఈ ప్రతిపాదనను కర్ణాటక బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తిరుమలలో వీఐపీ దర్శన సౌకర్యాలు ఉన్నాయని, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక హారతులు కల్పించాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి ఆలయాల్లో దర్శనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏ మాత్రం సబబు కాదని అన్నారు. తిరుమలకు వెళ్లే తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు తగిన మర్యాదలు లభిస్తోన్నాయని పేర్కొన్నారు.

English Summary

CM DK Shivakumar Move as Tirumala temple State Aarathi Now for Karnataka VIPs Plan Sparks Debate. Devotees attending the event are required to wear traditional attire. Men should wear a dhoti, while women should wear a saree or other traditional dress.