కావేరి జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు మధ్య వాతావరణం మరోసారి వేడెక్కింది. ఆగస్టు 13వ తేదీన వివిధ కన్నడ సంఘాలు కర్ణాటక బంద్ కు సైతం పిలుపునిచ్చాయి. 3వ తేదీన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముట్టడించనున్నాయి. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ వెలువడిన ఆదేశాలకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందిస్తోంది.
ఈ నేపథ్యంలో.. తమిళనాడుముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నడ ప్రజల్లో ఉద్వేగభరిత పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి విజయ్, ఆయన మంత్రులు, అధికారులు ఇక్కడికి రావడం ఏమాత్రం సముచితం కాదని స్పష్టం చేశారు.
ఈ పర్యటన వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని డీకే శివకుమార్ అన్నారు. తమ ఆహ్వానం మేరకు విజయ్ బెంగళూరుకు వస్తే కన్నడ సంఘాల ప్రతినిధుల నుంచి నిరసనలు ఎదురుకావడం, సమావేశాలను ముట్టడికి ప్రయత్నించడం వంటి ఘటనలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. ఇవి.. క్షేత్ర స్థాయిలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. విజయ్ పర్యటన చుట్టూ కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోన్నారని, ఇది ఎంత మాత్రం మంచిది కాదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కావేరీ నదీ జలాలపై చర్చించడానికి చెన్నై వెళ్లి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో స్వయంగా సమావేశం కావాలని భావించానని, ఆ సమయంలో అటువైపు నుంచి ఎటువంటి అనుమతి లభించలేదని డీకే శివకుమార్ గుర్తు చేశారు. ప్రస్తుతం శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవడానికి సీఎం విజయ్ స్వయంగా ముందుకు వచ్చారని, తానే బెంగళూరుకు వచ్చి మాట్లాడతానని విజయ్ తెలిపినా, ప్రస్తుత పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే రావొద్దని కోరినట్లు డీకే శివకుమార్ వివరించారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు అదనంగా 3,500 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నీటిని విడుదల చేస్తే.. కర్ణాటకలోని కృష్ణరాజ సాగర్, కబిని వంటి ప్రధాన జలాశయాల్లో తాగునీటి అవసరాలకే నీరు సరిపోవడం లేదని, ఈ పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కన్నడ సంఘాలు చెబుతున్నాయి. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపడుతున్నాయి. ఆగస్టు 13వ తేదీన బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కర్ణాటక ప్రభుత్వం తదుపరి వ్యూహాలు రచిస్తోంది. మరోవంక.. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్ సినిమా ప్రదర్శనను కర్ణాటక వ్యాప్తంగా నిలిపివేశారు. కావేరీ నదీ జలాల వివాదం పతాకస్థాయికి చేరినందున కర్ణాటక చలనచిత్ర మండలి ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జననాయగన్ సినిమా ప్రదర్శనను కొనసాగిస్తే.. థియేటర్లపై కన్నడ సంఘాల ప్రతినిధులు దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. ఇదివరకే మండ్య సహా పలుచోట్ల జననాయగన్ సినిమాను బలవంతంగా నిలిపివేశారు.ఆ రోజున కర్ణాటకలో సంపూర్ణ బంద్- బెంగళూరులో రేపే కీలక భేటీ.. !!
ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?
చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!