బెంగళూరు సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర నడిబొడ్డున పచ్చదనాన్ని పెంపొందిచడం, పరిశుభ్రతను కాపాడటంలో ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ, పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.
పరిశుభ్రతను కాపాడటంలో భాగంగా ఫ్రీడమ్ ఫ్రమ్ వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డీకే శివకుమార్. ఈ విషయంలో నగర ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. నగరంలో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను పారబోసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పక్కన వ్యర్థాలను కుప్పలుగా పోస్తే, సదరు వాహనాలను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటికప్పుడు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
బెంగళూరు సిటీ.. ఒక్క ప్రభుత్వానికి మాత్రమే చెందినది కాదని, కోటి మందికి పైగా ఉన్న ప్రజల సంపదగా అభివర్ణించారు డీకే శివకుమార్. ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో, నగర పరిసరాలను కూడా అంతే సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు నిర్మాణ శిథిలాల నిర్వహణ కూడా సవాల్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ నిర్మాణ వ్యర్థాలను పారబోయడం వల్ల నగర అందాలు దెబ్బతినడమే కాకుండా రద్దీగా ఉండే రహదారుల వెంట ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని డీకే శికుమార్ పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా అడ్డుకోవడానికి నగర పోలీస్ శాఖకు త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించనున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యర్థాల సమస్య బెంగళూరులోనే కాకుండా అన్ని మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీలలో కూడా తీవ్రంగా ఉందని ఆయన ఈ సందర్భంగా డీకే శివకుమార్ గుర్తు చేశారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను తాను స్వయంగా పరిశీలించానని, బెంగళూరుకు మాత్రం అటువంటి దుస్థితి రాకూడదని ఆకాంక్షించారు. నగరాన్ని పాడుచేసే వారిపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని, ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో కీలకమని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో సాగుతున్న అభివృద్ధి పనులపైనా ఆయన కఠిన నిబంధనలు విధించారు. విభిన్న ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల్లో చేపట్టే ఎలాంటి మౌలిక వసతుల నిర్మాణ పనులైనా సరే, ప్రారంభించిన నాటి నుంచి గరిష్టంగా అయిదేళ్ల కాలపరిమితిలోనే పూర్తి కావాలని ఆదేశించారు. సుదీర్ఘ కాలం పాటు పనులను పెండింగ్‌లో ఉంచడం వల్ల సామాన్య ప్రజలకు రోజువారీగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని వివరించారు.దిస్ ఈజ్ హాల్ మార్క్ ఆఫ్ చంద్రబాబు- ఇకపై హబ్ అండ్ స్పోక్ ఎయిర్ పోర్ట్స్: ఏపీకి వరాలు
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ టికెట్ రేట్లు అద్దిరిపోయాయ్: వ్లాగర్లకు మరీనూ !!