ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన!

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 20న పార్లమెంట్ వరకు శాంతియుత పార్లమెంట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. పార్లమెట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలపగా.. ఇప్పటికే పార్లమెంట్ మార్చ్‌కు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి సోనమ్ వాంగ్‌చుక్, అభిజిత్ దీప్కే నాయకత్వం వహించనున్నారు. ఆ పాదయాత్రలో పాల్గొనాలని అభిజిత్ దీప్కే ప్రజలకు పిలుపునిచ్చారు. పేపర్ లీక్‌లు, ఇతర విద్యా సంబంధిత సమస్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే డిమాండ్ తో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. నేటికీ ఆయన నిరాహార దీక్ష 12వ రోజుకు చేరుకోగా.. ఆయన బరువు 7 కిలోలు తగ్గింది.

Advertisement

టార్పాలిన్‌ను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతించని పోలీసులు
ఇదిలా ఉండగా.. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా జంతర్ మంతర్ వద్ద నీరు నిలిచిపోయింది. నిరసనకారుల పరుపులు, వేదిక తడిసిపోయాయి. వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కాగా.. వర్షం నుంచి రక్షణ కోసం వాటర్ ఫ్రూఫ్ టార్పాలిన్లను లోపలికి అనుమతించడం లేదన కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు లేఖ సమర్పించినా.. గత మూడు రోజులుగా అనుమతి లభించలేదని ఆయన వెల్లడించారు.

Advertisement

పోలీసులు, సీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం
ఢిల్లీ పోలీసులు తమ కోసం టెంట్లు ఏర్పాట్లు చేసుకోగా.. నిరసనకారులను టార్పాలిన్లను కూడా లోపలికి తీసుకెళ్లనివ్వడం లేదు. ఆ సమయంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అభిజిత్ దీప్కే పోలీసు అధికారుల ముందు మోకరిల్లి.. టార్పాలిన్లను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి కోరుతూ కనిపించాడు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగిందియ ఈ క్రమంలో ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.

English Summary

cockroach janata party Said its Parliament march on July 20 Would Begin From Jantar Mantar along with Climate Activist Sonam Wangchuk.