Diamond Flower: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు అయిన హిమాలయాలు ఎన్నో రహస్యాలకు, ప్రకృతి అద్భుతాలకు నిలయంగా ఉన్నాయి. హిమాలయాల్లో లభించే వృక్ష సంపద, అరుదైన మొక్కలు నిత్యం సైంటిస్టులతో పాటు సామాన్యులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ అద్భుతమైన, అత్యంత అరుదైన దృశ్యం హిమాలయాల్లో వెలుగులోకి వచ్చింది. ఓ అరుదైన పువ్వుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. మనిషి ఎత్తు కంటే పొడవుగా పెరిగే అరుదైన పువ్వులు హిమాలయాల్లో వికసిస్తున్నాయి.
మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!
ఈ అరుదైన పుష్పాన్ని హిమాలయన్ డైమండ్ ఫ్లవర్ అని.. స్థానికంగా కెంజో అని పిలుస్తారు. ఈ మొక్కలు సాధారణంగా 3.2 అడుగుల నుంచి 6.5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అంటే దాదాపు ఓ మనిషి ఎత్తు అన్నమాట. అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో, ప్రతికూల వాతావరణంలో మాత్రమే ఇవి పెరుగుతాయి. పసుపు రంగులో కాంతులీనే ఈ పువ్వులు రాత్రి వేళల్లో మరింత అందంగా కనిపించడం వీటి ప్రధాన ప్రత్యేకత. ఈ హిమాలయన్ డైమండ్ ఫ్లవర్స్ అత్యంత అరుదైనవిగా మారడానికి ఓ కారణం ఉంది. అదేమిటంటే ఈ పుష్పాలు ప్రతి సంవత్సరం వికసించవు. దాదాపు 7 నుంచి 15 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇవి వికసిస్తాయి. తమ జీవితకాలంలో ఒక్కసారే పూచే స్వభావం ఉండటంతో వీటిని చూసేందుకు పర్యాటకులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.
ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ వింతను చూసేందుకు ఓ నెటిజన్ తన స్నేహితులతో కలిసి హిమాలయాల్లోని ప్రమాదకరమైన కొండలు ఎక్కి ఈ పువ్వులను చూసేందుకు వెళ్లాడు. అక్కడ వికసించిన వజ్రపు పువ్వులను వారు చేతుల్లో పట్టుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆ వీడియోలో కొందరు యువకులు అంత అరుదైన పువ్వులను కోయడం స్పష్టంగా కనిపించింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి అద్భుతమైన, అరుదైన వనరులను తుంచేసి పాడుచేయవద్దని, వాటిని ఉన్నచోటే కాపాడుకోవాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. మరికొందరు ఇలాంటి వింత పువ్వును చూడటం ఇదే మొదటిసారి అంటూ కామెంట్లు చేస్తున్నారు.చెన్నై మెట్రోలో సీఎం విజయ్.. టిక్కెట్టు కొని ప్రయాణం.. వీడియో వైరల్