Viral Video: మద్యం మత్తులో నడిరోడ్డుపై పడుకుని.. రీల్స్ చూస్తూ..

మందు ఎక్కువైన వాళ్లు ఏం చేస్తున్నారనేది అర్థం కాదు. మద్యం మత్తులో వింత వింత చేష్టలు చేస్తుంటారు. రోడ్డుపై హల్ చల్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి తాపీగా నడిరోడ్డుపై పడుకున్నాడు. ఇంట్లో పడుకున్నట్లుగా రోడ్డుపై పడుకున్నాడు. అంతేకాక సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుటు నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.

Advertisement

ఈ ఘటన తమిళనాడులోని అరియాలూర్ జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో నడి రోడ్డుపై పడుకున్నాడు ఆ వ్యక్తి. సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ.. పాటలు వింటూ కాలక్షేపం చేశాడు. రోడ్డుపై లారీలు, స్కూల్ బస్సులు వేగంగా వెళ్తున్నా వాటిని ఆయన పట్టించుకోకుండా ఇంట్లో పడుకున్నట్లు పడుకున్నాడు. అటుగా వెళ్లే వాహనదారులు ఆయన్ను ఢీ కొట్టకుండా పక్కకు జరుపుకుంటూ వెళ్లసాగారు.

Advertisement

ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడ్ని వెంటనే రోడ్డు పై నుంచి పక్కకు లాగేయాలని కామెంట్స్ పెడుతున్నారు. మద్యం మత్తులో ఉన్నా ఇలా రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు. అతడికి పోలీసులు బుద్ధి చెప్పాలని రోడ్డుపై వాహనదారులకు ఇబ్బంది కలిగించడం నేరంగా పరిగణించాలని చెబుతున్నారు.