విద్యార్థుల ఎదుటే టీచర్‌ దారుణ హత్య.. 30 సెకన్లలో 34 కత్తిపోట్లు..!

హరియాణాలోని ఫరీదాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలలో దారుణ హత్య జరిగింది. మహిళా టీచర్ ను ఓ దుండగుడు విచక్షణారహితంగా పొడిచి చంపాడు. 20 సెక్షన్లలోనే దాదాపు 20 కత్తిపోట్లతో ఆమెపై విరుచుకుపడ్డాడు. దాంతో ఆమె పాఠశాలలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో దుండుగుడు అక్కడి నుంచి పారిపోయాడు. తోటి టీచర్లు ఘటనాస్థలికి వచ్చేలోపే ఈ షాకింగ్ ఘటన క్షణాల్లో జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement
'రామాయణ' ట్రైలర్‌ సంచలన రికార్డ్.. 800 మిలియన్ వ్యూస్ తో వరల్డ్ టాప్ 3 రేసులో..!
Advertisement

ఫరీదాబాద్ లో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఫరీదాబాద్ లోని సిర్కోనా ప్రాంతంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్ లో సంధ్య(26) అనే ఇంగ్లీష్ టీచర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెను ఫరీదాబాద్ లోని కోట్ ప్రాంతానికి చెందిన అమిత్(21) అనే యువకుడు గత రెండేళ్లుగా వెంబడిస్తున్నాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమెకు అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ అమిత్ మాత్రం ఆమెను ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టసాగాడు. అయితే అమిత్ ప్రేమను సంధ్య నిరాకరిస్తూ వస్తోంది.

ప్రభాస్ 'ఫౌజీ' బిగ్ అప్డేట్.. టీజర్, ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ గా థియేటర్లలోకి..!
Advertisement

ఈ క్రమంలోనే ఆమెపై కక్ష పెంచుకున్న అమిత్ ఎలాగైనా ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. అలా సోమవారం ఉదయం సిర్కోనాలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్ లోకి మెల్లగా చొరబడ్డాడు. అదే సమయంలో సంధ్య విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. దాంతో మెల్లగా క్లాస్ రూమ్ వద్దకు చేరుకుని సంధ్యను బయటకు పిలిచాడు. ఆమె అనుమానంగా చూడడంతో మీ భర్త వచ్చాడు.. రమ్మంటున్నాడు అని అన్నాడు. దాంతో సంధ్య క్లాస్ రూమ్ బయటకు రాగా ఆమెను బలవంతంగా స్కూల్ గేట్ వైపునకు ఈడ్చుకుంటూ వెళ్లాడు.

ఇదే సమయంలో కత్తితీసి విచక్షణారహితంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడ, ఛాతిపై కేవలం 30 సెకన్లలోనే 34 సార్లు కత్తిపోట్లు పొడిచాడు. దాంతో ఆమె స్పృహ తప్పి అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో తోటి టీచర్లు వచ్చి చూడగా అప్పటికే సంధ్య మృతి చెందింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.