కేంద్రం వద్ద 2,530 కి. మీ. రేంజ్ మిస్సైల్- హిందూ మహాసముద్రంపై: గజ గజ

హిందూ మహాసముద్రంలో భారత్ మరో లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. దాదాపు 2,530 కిలోమీటర్ల పరిధిని లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారత అధికారులు ఇప్పటికే గగనతలం, సముద్ర మార్గాలకు వర్తించేలా నోటమ్ (NOTAM - నోటీస్ టు ఎయిర్‌మెన్) హెచ్చరికలను సైతం జారీ చేశారు. ఈ తాజా పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

భద్రతా నియమాల ప్రకారం ఏదైనా క్షిపణిని పరీక్షించే సమయంలో ఆ ప్రాంతంలో ప్రయాణించే పౌర విమానాలు, రవాణా నౌకల భద్రత కోసం ఇలాంటి నోటీసులను జారీ చేస్తుంటారు. ఈ నిర్దేశిత కారిడార్ సాధారణంగా ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంతో ముడిపడి ఉంటుంది. డీఆర్డీఓ, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షలను సమన్వయం చేయనున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది.

Advertisement

ఇది లాంగ్ రేంజ్ మిస్సైల్.. అగ్ని సిరీస్ కు చెందినది గానీ, జలాంతర్గామి నుండి ప్రయోగించే కే-4 బాలిస్టిక్ క్షిపణి అధునాతన వెర్షన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తోన్నారు. భారత్ వద్ద ఇప్పటికే 5,000 కిలోమీటర్ల వ్యూహాత్మక పరిధి గల అగ్ని 5 వంటి అత్యాధునిక క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. సముద్ర ఆధారిత అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ తాజా పరిధి చాలా కీలకం కానుంది.

మెగా హీరో లేటెస్ట్ ఫిల్మ్ ట్రైలర్ కట్.. గ్రిప్పింగ్: హిట్ గ్యారంటీ

హిందూ మహాసముద్ర ప్రాంతం భౌగోళికంగా భారత్ రక్షణకు అత్యంత వ్యూహాత్మకమైనది. పొరుగునే ఉన్న చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టడానికి ఈ లాంగ్ రేంజ్ క్షిపణులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. భూమి, ఆకాశం, జల మార్గాల నుండి పరస్పర దాడులను అడ్డుకోగల న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజా మిస్సైల్ టెస్ట్ నిర్వహించనుంది.

Advertisement
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం- సీఎం డీకే శివకుమార్ టీమ్ లో వీళ్లకే చోటు

ఈ కీలక ప్రయోగ సమయంలో నౌకాదళం, వాయుసేన హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పర్యవేక్షిస్తాయి. అంతర్జాతీయ పౌర విమానాలతో పాటు ఇతర దేశాల నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అది రక్షణ రంగంలో దేశీయ పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసినట్టవుతుంది. అలాగే.. హిందూ మహాసముద్రం రీజియన్ లో భారత్ పట్టు బిగించినట్టవుతుంది.

English Summary

India set to issued a notam indicating a likely long range missile test in the Indian Ocean Region on 6 to 7 August. The reported range is near 2,530 km. The update outlines expected timing and location, supporting regional awareness and information sharing.