అంతరించిపోతున్న అరుదైన చిరుత. భారీ సెక్యూరిటీతో మాస్టర్ ప్లాన్

దట్టమైన చెట్ల కొమ్మల మధ్య, ఎవరికీ చిక్కకుండా దాగుడుమూతలు ఆడే అరుదైన వన్యప్రాణి 'క్లౌడెడ్ లెపర్డ్' (మేఘాల మచ్చల చిరుత). ఒంటిపై మేఘాల ఆకారాన్ని పోలే మచ్చలు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. చాలా అరుదుగా కనిపించే ఈ వింత చిరుత సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. 'అంతర్జాతీయ క్లౌడెడ్ లెపర్డ్ దినోత్సవం' సందర్భంగా ఈశాన్య భారతదేశంలో అంతరించిపోతున్న ఈ వన్యప్రాణి జాతిని కాపాడుకునేందుకు ప్రత్యేక 'యాక్షన్ ప్లాన్'ను అధికారికంగా పట్టాలెక్కించింది.

Advertisement

కోయంబత్తూరు వేదికగా ఇటీవల జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ 91వ సమావేశంలో ఈ సంరక్షణ ప్రాజెక్టును ఆవిష్కరించారు. కేంద్ర అటవీ-పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు, ఈశాన్య అడవుల్లో ఈ చిరుతల మనుగడకు కొత్త ఊపిరి పోయనుంది. కేవలం ఈ మచ్చల చిరుతలను కాపాడటమే కాకుండా, అవి తిరిగే అటవీ కారిడార్లను పునరుద్ధరించడం ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.

Advertisement

Viral Video: అడవిలో అరుదైన చిరుతల సందడి!

14 ప్రత్యేక ప్రాంతాల గుర్తింపు

ఈశాన్య రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టి, క్లౌడెడ్ లెపర్డ్స్ ఎక్కువగా సంచరించే 14 ముఖ్యమైన అటవీ మండలాలను అధికారులు గుర్తించారు. ఒక అడవి నుంచి మరో అడవికి ఇవి సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా మధ్యలో దెబ్బతిన్న అటవీ ప్రాంతాలను తిరిగి అభివృద్ధి చేస్తారు. దీనివల్ల ఇవి జనావాసాల్లోకి రాకుండా, అడవి లోపలే రక్షణగా జీవించగలుగుతాయి. అంతేకాకుండా, అంతరించిపోతున్న ప్రత్యేక జీవుల రక్షణ పథకం కిందకు ఈ చిరుతను చేర్చి, వీటికి ప్రత్యేక నిధులు, భద్రత కల్పించే ఏర్పాటు చేశారు.

Advertisement
దేశంలో తొలిసారిగా మంచు చిరుతల కౌంటింగ్! భారీగా పెరిగిన పులులు

సాంకేతికతతో నిఘా బందోబస్తు

ఇకపై ఈ చిరుతల అడుగుజాడలను పసిగట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. అడవుల్లో కెమెరా ట్రాప్‌లు, డీఎన్‌ఏ పరీక్షలు , అలాగే అటవీ సిబ్బందికి 'M-STrIPES' అనే స్మార్ట్ యాప్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వేటగాళ్ల బారిన పడకుండా గస్తీని తీవ్రతరం చేయడంతో పాటు, స్థానిక తెగలు, గ్రామీణులను కూడా ఈ సంరక్షణ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపిస్తూ, పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను వారి చేతుల్లోనే పెడుతున్నారు. పొరుగు దేశాల సరిహద్దుల్లో కూడా ఈ చిరుతల రక్షణకు అంతర్జాతీయ సహకారం తీసుకోనున్నారు.

English Summary

India launches the Clouded Leopard Conservation Action Plan (CAP) to protect Northeast India's elusive wild cats. Discover how this initiative uses advanced tech, habitat restoration, and community support to safeguard the species