Viral Video: జైల్లో వ్లాగ్స్ చేయొచ్చా?: ఖైదీల లగ్జరీ లైఫ్ చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు!

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రకరకాల వ్లాగ్స్ చూడటం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా జైలు లోపల ఖైదీలు చేసే వ్లాగ్ చాశారా? ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఓ వైరల్ వీడియో నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. జైలు గదిలోనే ఉంటూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని లగ్జరీ లైఫ్‌ను చూపిస్తున్నఓ యువకుడి వీడియో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాల కామెంట్లు చేయడం ప్రారంభించారు. అసలు జైల్లోకి ఫోన్ ఎలా వెళ్లింది? అక్కడ వ్లాగ్స్ చేయడానికి అధికారులు ఎలా అనుమతించారు? అనే ప్రశ్నలతో నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. కొందరైతే ఆ జైలు గదిని తమ హాస్టల్ గదులతో, పీజీ గదులతో పోలుస్తూ.. వాటికంటే బెటర్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే నిజంగానే జైలు లోపల ఇలా వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుందా అంటూ ప్రశ్నించారు.

Advertisement

అయితే అసలు విషయానికొస్తే సాధారణంగా జైలు లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి ఉండది. ఈ నేపథ్యంలో జైలులో వ్లాగింగ్ చేయడం అనేది అసాధ్యమైన విషయం. మరి వైరల్ అవుతున్న వీడియోలోని జైలు కథ ఏమిటనేది సదరు నెటిజన్ స్వయంగా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'లక్ష్య' అనే సినిమా రంగానికి చెందిన యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారిన తర్వాత.. అది నిజమైన జైలు కాదని.. ఓ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ అంటూ ఆ యూజర్ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో.. స్టార్ హీరో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన 'బందర్' సినిమా షూటింగ్ సెట్‌లో ఈ వీడియోను షూట్ చేశాడు. ఈ సినిమా 2026 మే 22న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జైలుకు సంబంధించిన అనేక సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసమే ప్రత్యేకంగా ఈ జైలు సెట్‌ను నిర్మించారు. కానీ ఆ సెట్ చూడటానికి మాత్రం నిజమైన జైలే అని అందరూ నమ్మేలా నిర్మించడం గమనార్హం.

ఈ జైలు వ్లాగ్ చూసిన అనంతరం నెటిజన్లు ఫన్నీకామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్ల హాస్టల్ గదులు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయి" అని రాయగా.. మరొకరు "మా వంశంలో జైలు లోపల వ్లాగ్ చూసిన మొదటి వ్యక్తిని నేనేనేమో" అంటూ జోక్ చేశారు. మరొకరు స్పందిస్తూ.. "మేముండే పీజీ రూమ్ కంటే ఈ జైలు గది చాలా శుభ్రంగా, బాగుంది.. మొబైల్, ఇంటర్నెట్ అన్నీ ఇస్తున్నారు..ఇది కదా లగ్జరీ లైఫ్ అంటే" అంటూ ఫన్నీగా కామెంట్లు పెట్టడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

English Summary

Jail Vlogging Video showing a man vlogging inside a prison cell has shocked internet users. Know the real truth behind this viral jail video and its Bollywood connection.