పక్కనే భర్త శవం.. కొడుకు రక్తపు మడుగులో.. కానీ ఆ లేడీ డాక్టర్ బెడ్‌పై ఏం చేస్తోందంటే?


కర్ణాటకలోని ధార్వాడ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భర్త గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉండగా.. 8 ఏళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఆ గదిలోనే ఉన్న ఆ పిల్లాడి తల్లి తనకేమీ పట్టనట్లు బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తూ ఉండడం కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన బంధువులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు.

Advertisement
ఓటీటీలోకి బుర్రపాడు చేసే మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..!
Advertisement

ఈ ఘటనలో మృతుడిని 45 ఏళ్ల అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ హోనన్నవర్‌గా పోలీసులు గుర్తించారు. డాక్టర్ కిరణ్ గొంతుపై కత్తిపోట్లతో బెడ్ రూమ్ నేలపై విగతజీవిగా పడి ఉన్నాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న 8 ఏళ్ల కుమారుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిందనే అనుమానంతో కిరణ్ భార్య, కంటి డాక్టర్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం నుంచి డాక్టర్ కిరణ్ ఫోన్ కలవకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ప్రియాంకకు ఫోన్ చేయగా.. ఆమె ఒక్కోసారి ఒక్కో తీరుగా పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంంతో అనుమానం వచ్చిన బంధువులు వారి ఇంటికి చేరుకున్నారు. తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో వారు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉందని.. ప్రాథమిక దర్యాప్తులో బయటి వ్యక్తులెవరూ లోపలికి వచ్చినట్లు ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనా సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, వారి కుమారుడు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. ఓ గదిలో కిరణ్ బోర్లా పడి ఉండగా.. మరో గదిలో కొడుకు రక్తపు మడుగులు పడి ఉన్నాడు. అదే గదిలో ప్రియాంక ఏ మాత్రం చలనం లేకుండా ఫోన్ చూస్తూ గడుపుతుండడం వీడియోల ద్వారా తేలిపోయింది.

Advertisement
ప్రియుడి కోసం భర్తను చంపి, ముక్కలు చేసి అడవిలో పారేసిన భార్య!

అయితే ప్రస్తుతం ప్రియాంక షాక్ లో ఉందని.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తోందని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలే కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దంపతులు కుమారుడికి ఆటిజం ఉన్నట్లు తెలిసింది. ఈ ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

English Summary

Karnataka Horror, Shocking Incident in Dharwad, Dr.Kiran Honannavar Was Found Murdered, his son Stabbed, While his Doctor Wife Priyanka Was Found Scrolling through her Phone.