E20 పెట్రోల్ పై కేజ్రీవాల్ సంచలనం.. రేపు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి..!

ఈ-20 పెట్రోల్ పై దిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ-20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రధాని నివాసానికి 100 మందితో చేరుకుని ఈ 20 పెట్రోల్ కు వ్యతిరేకంగా పిటిషన్లు అందజేస్తామని అన్నారు. దేశ ప్రజలపై ఈ-20 పెట్రోల్‌ను కేంద్రం బలవంతంగా రుద్దుతోందని మండిపడ్డారు. ఈ-20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడై, మైలేజీ పడిపోతోందని విమర్శించారు. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ కోసమే ఇథనాల్‌ పెట్రోల్‌ ను కేంద్రం తీసుకొచ్చిందని ఈ మేరకు అమెరికా నుంచి ఇథనాల్ పెట్రోల్ కొనుగోలు చేసేందుకు భారత్.. అమెరికాపై ఒత్తిడి తేవడంపై ఏదో రహస్య ఎజెండా దాగి ఉందని స్పష్టం చేశారు.

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన ఈ 20 పెట్రోల్ విధానంపై ఇప్పటికే ప్రతిపక్షాలు, కొన్ని వినియోగదారుల సంస్థలు ఆందోళనలను వ్యక్తం చేశాయని ఈ విధానం వల్ల పాత వాహనాలపై ప్రభావం పడుతుందని ఆ వాహనాలు 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కు అనుగుణంగా తయారు చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆప్ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ.." నేను ప్రధాని అధికారిక నివాసం ముట్టడికి వెళ్తున్నా. వంద మంది నిరసన కారులతో ముట్టడి ఉంటుంది. ఈ20 కు సంబంధించిన పిటిషన్లపై ప్రజలు సంతకాలు చేశారు. అలాగే ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ పై చర్చిస్తాం. ఈ 20 పెట్రోల్ విధానంపై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉంది. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉంది" అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Advertisement

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రధాని మోదీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇథనాల్ ను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని కానీ ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. అందుకే ప్రధాని మోదీ నివాసానికి వ్యక్తిగతంగా హాజరై పిటిషన్ అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.