అమిత్ షా తో రాజీనామా చేయించండి: ఖర్గే సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా విద్యార్థులపై ఫేక్ ఎఫ్ఐఆర్ లు పెట్టడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నీట్ పేపర్ లీక్ ఉద్యమం ముగిసిన వెంటనే విద్యార్థులపై కేంద్రం ఇలా పగ తీర్చుకుంటోందని మండిపడ్డారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నీట్ నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు.

Advertisement

నీట్ పేపర్ లీక్ పై ఉద్యమించిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. " నరేంద్ర మోదీ గారూ.. పది రోజుల క్రితం మీ ప్రభుత్వం.. యువతపై లాఠీ ఛార్జీలు, బాష్ప వాయువులు, రబ్బర్ బుల్లెట్లతో విరుచుకుపడింది.. అని ఖర్గే తన ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు.

Advertisement
ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?

ఈ మేరకు జూలై 20 న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంసద్ ఛలో కార్యక్రమాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థులు తమ ఉద్యమాన్ని విరమించుకున్నారు. కానీ మీరు మాత్రం ఫేక్ ఎఫ్ఐఆర్ లు విద్యార్థులపై పెట్టి వారిని బలవంతంగా నిర్బంధిస్తున్నారు.. అని ఖర్గే మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదన్న హామీతోనే విద్యార్థులు నిరసనలు ముగించారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఇచ్చిన మాటను పక్కనబెట్టి విద్యార్థులపై కక్ష సాధిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో యువకుల అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి. యువతుల పర్సనల్ వివరాలు ఇంటర్నెట్ లో లీక్ అవుతున్నాయి.. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనీసం మాట్లాడలేదు. కేంద్రం జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తోంది.. అని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా కు ఇంత అహంకారం ఉండరాదని స్పష్టం చేశారు. మీకు కొంచమైనా సిగ్గు ఉంటే.. వెంటనే అమిత్ షాతో రాజీనామా చేయిచాలని ప్రధాని మోదీకి ఖర్గే సూచనలు చేశారు.