తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ త్వరలో చేపట్టబోయే బెంగళూరు పర్యటన నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కావేరి నదీ జలాల పంపకాల వివాదంపై చర్చించేందుకు ఆయన బెంగళూరు రానున్నారు. దీన్ని వాయిదా వేసుకోవాలంటూ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బహిరంగంగానే విజ్ఞప్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి రావడం వల్ల చిక్కుముళ్లు మరింత బిగుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామాల మధ్య బీజేపీ కర్ణాటక రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తెరమీదికి వచ్చారు. విజయ్ కు ఓ లేఖ రాశారు. కావేరీ వివాదంపై ప్రతిపాదించిన చర్చల్లో తమ రాష్ట్ర రైతులు, ప్రజల ఇబ్బందుల పట్ల సానుభూతితో, స్నేహపూర్వక వైఖరితో వ్యవహరించాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలను గౌరవిస్తూ, సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
కావేరి బేసిన్ పరిధిలోని కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా బెంగళూరు నగర తాగునీటి అవసరాలకు ఈ నది ఎంత కీలకమో విజయేంద్ర తన లేఖలో ప్రస్తావించారు. రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఇప్పటికే రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ తాజా పరిస్థితులను తమిళనాడు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో, మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలని విజయేంద్ర కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మేకేదాటు ప్రాజెక్టు అంశాన్ని విజయేంద్ర తన లేఖలో ప్రధానంగా లేవనెత్తారు. బెంగళూరు తాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చడం కోసం ఉద్దేశించిన మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమిళనాడుకు దక్కాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటాకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. గతంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సంక్లిష్ట సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్న తీరును విజయేంద్ర గుర్తు చేశారు. బెంగళూరులో తిరువళ్లువర్ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన సమస్యను అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఎంతో పరిణతితో, పరస్పర గౌరవంతో పరిష్కరించారని గుర్తుచేశారు. ఆనాటి అగ్రనేతలు ప్రదర్శించిన రాజనీతిజ్ఞత, పరిపక్వత నేటి కావేరి నదీ జలాల వివాద పరిష్కారానికి కూడా ఒక దిక్సూచిగా మారాలని ఆయన లేఖలో సూచించారు. పొరుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, వాటిని ప్రజల విస్తృత ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం ఉమ్మడి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని విజయేంద్ర స్పష్టం చేశారు. కర్ణాటకలో నివసిస్తున్న కోట్లాది మంది తమిళ సోదరులు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అలాగే తమిళనాడులోని కన్నడిగులు ఆ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ఈ పరస్పర ఆధారపడే తత్వమే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న విడదీయరాని బంధానికి నిదర్శనమని అన్నారు. కావేరి నది ఇరు రాష్ట్రాల ప్రజలను విడదీయడానికి కారణం కాకూడదని, వారిని మరింతగా ఏకం చేసే ఒక జీవన బంధంగా నిలవాలని విజయేంద్ర ఆకాంక్షించారు. తమిళనాడు ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా, కర్ణాటక హక్కులను కాపాడేలా ఇరుపక్షాలు ఒక సముచిత నిర్ణయానికి రావాలని కోరారు. రెండు రాష్ట్రాల గౌరవాన్ని పెంపొందించే విధంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఈ వారంలో ఇంకా తగ్గే అయ్యే ఛాన్స్?
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ ఖాయమైన వేళ.. తిరుమల శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా