ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు, అల్పపీడన ద్రోణి హిమాలయ పాదప్రాంతాల వైపు కదలడంతో ఉత్తరాదిని ముసురు కమ్మేసింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో మబ్బులు దట్టంగా కమ్ముకుని, ఎడతెరిపి లేని వానలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆ మూడు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
వాతావరణ శాఖ ముఖ్యంగా మూడు రాష్ట్రాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నెక్స్ట్ రెండు రోజులు చాలా క్లిష్టమైనవని హెచ్చరించింది. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. కొండ కోనల్లో ఆకస్మికంగా పిడుగులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి.: మైదాన ప్రాంతాలైన యూపీ, బీహార్‌లలో నదులు పొంగిపొర్లుతూ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలు పూర్తిగా స్తంభించే ప్రమాదముంది.
ఈ ఏడాదినైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదువుతున్న వర్షపాతం పాత రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ఏడాది అత్యంత భారీ వర్షాలు కురిసిన సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందా అనే అంశంపై వాతావరణ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. వానల ధాటికి ప్రజలు, ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వాతావరణ కేంద్రం క్షేత్రస్థాయి నుంచి క్షణక్షణం సమాచారాన్ని సేకరిస్తోంది. డాప్లర్ వెదర్ రాడార్లు, ఉపగ్రహాలు, ఆటోమేటిక్ రైన్ గేజ్ వ్యవస్థల ద్వారా వర్షాల తీవ్రతను, ఈదురుగాలుల వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయక బృందాలను రంగంలోకి దించడానికి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా ముందస్తు రక్షణ అలర్ట్‌లను విడుదల చేస్తున్నారు.IMD: రుతుపవనాల ద్రోణి మార్పు.. శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ అసలు నిజం..
రికార్డు స్థాయిలో ముంచెత్తుతున్న వానలు
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన- ఈ జిల్లాల్లో ఇక కుండపోత, తాజా హెచ్చరిక..!!
అత్యాధునిక సాంకేతికతతో పగలు-రాత్రి నిఘా