అక్రమ సంబంధం: భర్త మీద కసితో కుమార్తెను నీళ్లలో ముంచి చంపిన తల్లి, చివరికి!


భర్త మీద కసితో కుమార్తెను నీళ్లలో ముంచి చంపిన తల్లి...!

కరూర్ (తమిళనాడు): భర్తకు అక్రమ సంబంధం ఉందని భార్య అనుమానం పెంచుకుంది. భర్త మీద కసితో భార్య కన్న కుమార్తెను నీళ్లలో ముంచి కిరాతకంగా చంపేసింది. తల్లిదండ్రుల గొడవకు రెండున్నర ఏళ్ల చిన్నారి హత్యకు గురైన ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లా తిరుప్పూర్ సమీపంలోని సామలపురంలో జరిగింది.

పిల్లలు హత్య, లవ్ స్టోరీ చెప్పాలి, చాల మందితో కన్నుగీటు వీడియోలు, వైరల్: డిమాండ్

బిడ్డను హత్య చేసిన తమిళ్ ఇసక్కి (21) అనే కిరాతకురాలిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారి శివన్యశ్రీ అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ప్రేమ వివాహం

తమిళనాడులోని కరూరు జిల్లా కులిత్తలైకి చెందిన నాగరాజ్ (23), తమిళ్ ఇసక్కి (21) ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజ్, తమిళ్ ఇసక్కి కుమార్తె శివన్యశ్రీ. నాగరాజ్ భార్య, కుమార్తెతో కలిసి తిరుప్పూర్ సమీపంలోని సామలపురం రోడ్డులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. నాగరాజ్ ఇంటి పక్కనే అతని తల్లిదండ్రులు పళనిస్వామి, దనలక్ష్మి నివాసం ఉంటున్నారు.

గంట ముందు కొత్త బట్టలు

మూడు రోజుల క్రితం నాగరాజ్ తల్లి ధనలక్ష్మి ఊరికి వెళ్లారు. సోమవారం నాగరాజ్, అతని తండ్రి పళనిస్వామి పనికి వెళ్లారు. ఇంటిలో తమిళ్ ఇసక్కి, ఆమె కుమార్తె శివనశ్రీ మాత్రమే ఉన్నారు. అదే రోజు సాయంత్రం ధనలక్ష్మి ఇంటికి వచ్చింది. శివనశ్రీకి కొత్త బట్టలు వేసి పాలు తాగించి నిద్రపెట్టింది. తరువాత ధనలక్ష్మి ఆమె ఇంటికి వెళ్లిపోయింది.

నోటిలో నురుగు

రాత్రి నాగరాజ్ ఇంటికి వెళ్లాడు. కుమార్తె శివనశ్రీ నోటి నుంచి నురుగు వస్తున్న విషయం గుర్తించి ఆందోళన చెందిన నాగరాజ్ వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి శివనశ్రీ మరణించిందని వైద్యులు చెప్పారు.

చంపేసిన తల్లి

శివనశ్రీ నానమ్మ ధనలక్ష్మి ఫిర్యాదు చెయ్యడంతో మంగళం పోలీసులు కేసు నమోదు చేసి తమిళ్ ఇసక్కిని అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తె శివనశ్రీ తల మీద కట్టితో కొట్టానని, తరువాత ఇంటిలోని ప్లాస్టిక్ నీళ్ల తొట్టలో తల ముంచి హత్య చేశానని తమిళ్ ఇసక్కి అంగీకరించిందని పోలీసులు అన్నారు.

భర్త మీద అనుమానం

తన భర్త నాగరాజ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ప్రతినిత్యం తన భర్త నాగరాజ్ తనను వేధింపులకు గురి చేశాడని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పేవాడని తమిళ్ ఇసక్కి ఆరోపిస్తున్నది. ప్రతినిత్యం తన భర్త వేరే మహిళతో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడేవాడని, అందుకే శివనశ్రీని హత్య చేశానని తమిళ్ ఇసక్కి విచారణలో చెప్పిందని పోలీసులు అంటున్నారు.

చిన్నారి బలి

తమిళ్ ఇసక్కికి తన భర్త నాగరాజ్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని అనునమానం పెంచుకుందని, నిత్యం ఇంటిలో ఇదే విషయంపై గొడవలు జరగడంతో చిన్నారి శివనశ్రీ హత్యకు గురైయ్యిందని పోలీసులు అన్నారు. కొత్త బట్టలు వేసిన కొన్ని గంటలకే శివనశ్రీ హత్యకు గురికావడంతో చిన్నారి నానమ్మ ధనలక్ష్మి ఆర్తనాదాలు చేస్తున్నది.

Have a great day!
Read more...

English Summary

Tamil Esakki gives statement about how she murdered her daughter. She first beated her in head by stick, then she drowned her in water tank. Tamil Esakki from Tiruppur reveals why she kills her daughter because of suspection on her husband. A mother in Tiruppur kills her daughter because of she suspects her husband has illicit relationship with another.