నోయిడాలో బుధవారం ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 66 పరిధిలోని మమురా గ్రామంలో ఛార్జింజ్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ నుంచి వెలువడిన నిప్పురవ్వ కారణంగా నాలుగంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టి ఆ భవనంలోని 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని పోలీసులు వెల్లడించారు.
ఇంగ్లాండ్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ.. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్!(వీడియో)
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లేన్ 2లోని G+4 భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. తొలి నిప్పురవ్వ కారణంగా భవనంలో పార్క్ చేసి ఉన్న సమీపంలోని పెట్రోల్ వాహనాలకు నిప్పంటుకోవడంతో, మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంగణమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఏడు ఫైర్ టెండర్లు, హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి, భవనంలోని నివాసితులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించారని అధికారులు తెలిపారు.
ఆ భవనంలో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. సహాయక చర్యల సమయంలో నివాసితులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించారు. అయితే, పొగ పీల్చడం వల్ల ఆరోగ్యం క్షీణించిన ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఓ పురుషుడు, ఓ మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరప్రమాదంపై పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. చట్ట సంబంధిత నిబంధనల కింద భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు. "గ్రౌండ్ ఫ్లోర్‌లో ఛార్జింగ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ నుంచి వెలువడిన నిప్పురవ్వల కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు తర్వాత కచ్చితమైన కారణం తెలుస్తుంది" అని పోలీసులు వెల్లడించారు. ఆ భవనం అగ్నిమాపక భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా, ఏవైనా లోపాలు ప్రాణనష్టానికి దోహదపడ్డాయా అనే విషయాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.పుతిన్ అణు యుద్ధాన్ని ఆపింది ప్రధాని మోదీయే: పోలాండ్ సంచలన ప్రకటన!