e-PAN Card: కేంద్రం సీరియస్ అలర్ట్! డౌన్‌లోడ్ లింక్స్ క్లిక్ చేస్తున్నారా?


డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవల నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నిటికీ పాన్ కార్డ్ అత్యంత కీలకమైన పత్రంగా మారింది. ఇప్పుడు ఇదే ప్రాధాన్యతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. "ఆన్‌లైన్‌లో ఈ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్" అంటూ మీ మెయిల్‌ బాక్స్‌లోకి వచ్చే మెసేజ్‌ల వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ పొంచి ఉంది. ఇలాంటి మోసపూరిత ఈ-మెయిల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం శనివారం ప్రజలను తీవ్రంగా హెచ్చరించింది.

Advertisement

ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను పీఐబీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. దానిపై పెద్ద అక్షరాలతో 'ఫేక్' (నకిలీ) అని ముద్ర వేసింది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చినట్లుగా భ్రమ కలిగించేలా ఈ నకిలీ మెయిల్స్ ఉంటున్నాయి. "ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే అత్యంత ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్ ఒకటి.. దీని ఈ-కాపీని కింద ఉన్న లింక్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోండి" అంటూ సైబర్ కేటుగాళ్లు ప్రజలను నమ్మిస్తున్న తీరును పీఐబీ బయటపెట్టింది.

Advertisement

Credit Card: జాబ్ లేకపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చే సీక్రెట్ టిప్స్!

రెస్పాండ్ అవ్వకండి..

ఇలాంటి నకిలీ లింకులను క్లిక్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని కోరుతూ వచ్చే అనుమానాస్పద ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS) లేదా వాట్సాప్ లింకులకు ఎలాంటి సమాధానం ఇవ్వకూడదని గట్టిగా సూచించారు.

Wi-Fi: రూపాయి ఖర్చు లేకుండా ఈ చిన్న ట్రిక్ తో వైఫై స్పీడ్ డబుల్!
Advertisement

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చలామణీ అయ్యే ఇలాంటి మోసపూరిత సమాచారం, ఆన్‌లైన్ స్కామ్‌లపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం నిరంతరం నిఘా ఉంచుతోంది. సైబర్ వలలకు చిక్కకుండా ఉండాలంటే.. ఎలాంటి అధికారిక పత్రాలనైనా కేవలం ప్రభుత్వం కేటాయించిన వెబ్‌సైట్ల ద్వారానే వెరిఫై చేసుకోవాలని, గుర్తుతెలియని లింకులను నమ్మి మోసపోవద్దని పీఐబీ కోరింది.

English Summary

e-PAN cards, The Government's PIB Fact Check unit has issued a serious warning against fake emails and phishing links asking users to download e-PAN cards online to steal sensitive personal and financial data.