పురందేశ్వరికి ప్రమోషన్, కేబినెట్ నుంచి వీరు ఔట్ - కేంద్రంలో కొత్త మంత్రులుగా..!?

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రభుత్వంతో పాటుగా పార్టీ ప్రక్షాళన దిశగా పీఎం మోదీ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ సమయం లోనే మంత్రివర్గ ప్రక్షాళన.. బీజేపీ కొత్త జాతీయ కార్యకర్గం దిశగా నిర్ణయాలు చేస్తున్నారు. దీంతో, కేబినెట్ లో ఎవరు ఉంటారు.. ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది.

Advertisement

కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన తప్పేలా లేదు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పలువురు సీనియర్లను తప్పిస్తారని తెలుస్తోంది. వారిలో కొందరికి పార్టీ బాధ్యతలు.. ముగ్గురిని గవర్నర్లుగా పంపే విధంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్‌ సింగ్‌ పురీ, పంకజ్‌ చౌదరి, హర్ష్‌ మల్హోత్రలను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, నిర్మలా సీతారామన్ ను తప్పించి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు ఇస్తారనే అభిప్రాయం వినిపిస్తున్న సమయంలోనే కీలకమైన విద్యా శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఆర్దిక మంత్రిగా మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు అవకాశం ఉండే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక... కేబినెట్ లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గడిచిన రెండు పునర్వ్యవస్థీకరణల్లో మంత్రిత్వశాఖలు మారని మంత్రులకు ఈసారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

తుది కసరత్తు.. కీలక మార్పులు

ఇక, బీజేపీలో విలీనం అయిన పార్టీలకు మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఆప్ కు చెందిన పంజాబ్ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యారు. అదే విధంగా ఉద్ధవ్ కు చెందిన శివసేన ఎంపీలు బీజేపీకి దగ్గరయ్యారు. టీఎంసీ నుంచి ఎన్డీఏలో చేరిన వారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీని క్యాబినెట్‌ నుంచి తప్పించి గవర్నర్ గా పంపిస్తారనే చర్చ ఉంది. నిర్మలా సీతారామన్ మోదీ-షా కీలక బృందంలో ఆమె భాగస్వామిగా కొనసాగుతారని వర్గాలు చెప్పాయి. పంకజ్ చౌదరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇక.. కేబినెట్ లో ఏపీ ఎంపీ పురందేశ్వరికి సీటు ఖాయమని తెలుస్తోంది. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పురందేశ్వరికి మంత్రి పదవి దక్కుతుందని పార్టీ నేతల సమాచారం. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది.

English Summary

PM Modi reportedly planning a major Modi 3.0 Cabinet reshuffle and BJP organisational overhaul ahead of the Monsoon Session