ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?

ఆగస్టు 5. ప్రధాని మోదీ పాలనలో ఈ రోజుకు ఒక ప్రత్యేకత.. సెంటిమెంట్ ఉంది. ఎన్నో సంచలన నిర్ణయాలకు ఇదే తేదీ న జరిగాయి. మరో రెండు రోజుల్లో ఇదే తేదీ రానుంది. దేశ రాజకీయాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. అటు ఢిల్లీలో కేంద్రంలోని ముఖ్యులు కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నాయి. మరో వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరో సంచలన నిర్ణయం దిశగా కేంద్రం సమాయత్తం అవుతు న్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. ఏం జరుగుతోంది.. కేంద్ర నిర్ణయం ఏంటనే ఉత్కంఠ పెరుగుతోంది.

Advertisement

కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 5 న మరో సంచలనం నమోదు అవుతుంది అనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు గతంలో ఆగస్టు 5వ తేదనే ప్రకటించారు. 2019 లో ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన అనూహ్యంగా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. విపక్షాలు సైతం అంచనా వేయలేని విధంగా ఈ చట్టం ప్రతిపాదన.. ఆమోదం.. అమలు ద్వారా ప్రధాని మోదీ.. షా ద్వయం తమ కార్యాచరణ పక్కాగా అమలు చేసారు. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందు కుంది. అదే విధంగా 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది. శాతాబ్దా ల కాలంగా కోట్లాది మంది ఆకాంక్ష నెరవేర్చేందుకు తొలి అడుగు పడిన రోజు. తరువాత 2024 జనవరి 22న రామాలయం ప్రారంభం అయింది. మోదీ ప్రభుత్వంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆగస్టు 5 మరో సారి వస్తున్న వేళ... ఈ సారి తీసుకునే నిర్ణయం పైన అంచనాలు మొదలయ్యాయి.

Advertisement
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!

ప్రధాని నిర్ణయం పై ఉత్కంఠ

ఇక.. సెంటిమెంట్ గా మారిన ఆగస్టు 5 వస్తుండటంతో ఈ సారి కీలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు.. డీ లిమిటేషన్ బిల్లును గతంలో వీగిపోవటంతో ఈ సారి ఎలాగైనా ఆమోదించేలా కార్యాచరణ సిద్దం చేసింది. టీఎంసీ, ఆప్, శివసేన (థాకరే) నుంచి చీలిక ఎంపీల మద్దతు తో బిల్లు పాస్ చేయించాలని భావిస్తోంది. అయితే.. ఢిల్లీలో మారుతున్న రాజకీయ లెక్కల వేళ ఈ సమావేశాల్లో బిల్లు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారుతోంది. అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తయింది. పాలనా పరంగానూ పలు నిర్ణయాల అమలు దిశగా కేంద్రం కొత్త ఆలోచనలు సిద్దం చేస్తోంది. దీంతో.. పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్న వేళ.. ఆగస్టు 5న కేంద్రం ఏ నిర్ణయం చేస్తుందనేది రాజకీయంగా ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.

English Summary

PM Modi has made several landmark decisions on August 5 in previous years, making the date politically significant